Kalima In Islam (Image Source: Twitter)
జాతీయం

Kalima In Islam: కల్మా పేరుతో ఉగ్రవాదుల ఊచకోత.. ఇంతకీ అది ఏం చెబుతుందో తెలుసా?

Kalima In Islam: జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) ఉగ్రదాడిపై యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేస్తోంది. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు హేయమైన చర్యకు పాల్పడ్డారు. మతం అడిగి మరీ పర్యాటకుల ప్రాణాలను తీసినట్లు బాధితులు వెల్లడించారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. ‘మీరు ముస్లింలా? అయితే కల్మా చెప్పండి’ అని అడిగి మరి ప్రాణాలు తీశారు. దీంతో కల్మా అంటే ఏంటన్న ప్రశ్న దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో మెుదలైంది. ఇస్లాంలో కల్మాకు ఉన్న ప్రాముఖ్యత ఏంటా అని అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కల్మాలకు అర్థం ఏంటంటే?
కల్మా లేదా షహాదా (Shahada) అనేది ముస్లింల విశ్వాసానికి మౌలిక శిల. ఇది అల్లా ఏకత్వాన్ని, మహమ్మద్ ప్రవక్త బోదనలు నమ్మే ప్రకటన. ఇస్లాంలో మొత్తం 6 కల్మాలు ఉంటాయి. వాటిలో ప్రతీదీ కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

మొదటి కల్మా
మెుదటి దానిని కల్మా తయ్యిబ్ (Kalma Tayyib) అని పిలుస్తారు. దీనికి ‘స్వచ్ఛత’ అని అర్థం. ‘అల్లా  మాత్రమే దేవుడు. ఆయనకు చెరి సమానులు లేరు. ముహమ్మద్ ప్రవక్త ఆయన దూత’ అని మెుదటి కల్మా సూచిస్తుంది.

రెండో కల్మా
దీనిని కల్మా షహాదా (Kalma Shahada) అని పిలుస్తారు. దీనికి దేవుడి సాక్ష్యం అని అర్థం. ‘నేను సాక్ష్యమిస్తున్నాను.. అల్లా తప్ప మరో దేవుడు లేడు. ఆయన ఒక్కడే.. భాగస్వామిలేరు. మహమ్మద్ ప్రవక్త ఆయన సేవకుడు’ అని రెండో కల్మా సూచిస్తుంది.

మూడో కల్మా
మూడో దానిని కల్మా తంఝీద్ (Kalma Tamjeed) అని ముస్లింలు సంబోదిస్తారు. ‘దేవుడి మహిమ’ అని దీనికి అర్థం. ‘అల్లా చాలా పవిత్రుడు.. అల్లా స్తుతి, అల్లా తప్ప ఏ దేవుడు లేడు. అల్లా గొప్పవాడు. శక్తి, బలం అల్లాతో తప్ప మరెవ్వరితోనూ లేవు’ అని మూడో కల్మా చెబుతుంది.

నాలుగో కల్మా
దీనిని కల్మా తౌహీద్ (Kalma Tawheed) అని అంటారు. ఏకత్వం అనే అర్థాన్ని సూచిస్తుంది. ‘అల్లా తప్ప మరెవరూ పూజార్హుడు కాదు. ఆయన ఒక్కరే.. రాజ్యం, స్తుతి ఆయనదే. అల్లా ప్రాణం ఇస్తాడు.. తీసుకుంటారు. ఆయనకు ఎప్పటికీ మరణం ఉండదు. ఆయన దయామయుడు, మహిమలు కలవాడు. ఆయన చేతిలోనే అన్నీ ఉన్నాయి. ఆయనకు అన్నింటిపై అధికారం ఉంది’ అని నాల్గో కల్మా సూచిస్తుంది.

ఐదో కల్మా
ఐదో దానిని కల్మా అస్తఘ్ఫార్ (Kalma Astaghfar) అని అంటారు. దీనికి ‘పశ్చాత్తాపం’ అని అర్థం. ‘నేను తెలియక/రహస్యంగా/బహిరంగంగా చేసిన అన్ని పాపాలను మన్నించు. నాకు తెలిసిన పాపాలు గానీ తెలియనివి గానీ మన్నించు. నీవు రహస్యాలుగానూ పాపాలుగానూ కప్పిపుచ్చేవాడవు, క్షమించేవాడవు. బలం, శక్తి నీదే’ అని చెబుతుంది.

ఆరో కల్మా
ఆరో దానిని కల్మా రద్దే కుఫ్ర్ (Kalma Radde Kufr) అంటారు. అవిశ్వాసాన్ని తిరస్కరించడం దీనికి అర్థం. ‘నేను అల్లాహ్ తప్ప దేవుడులేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు భాగస్వామిలేరని నమ్ముతున్నాను. నేను బహు దేవారాధన, కుఫ్ర్, అసత్య విశ్వాసాలను తిరస్కరిస్తున్నాను. నీవే ఒకే నిజమైన దేవుడు, నీవే నా దైవం’ అని చెబుతుంది.

కల్మాలు ఎలా ఉపయోగపడాయి!
పైన చెప్పుకున్న 6 కల్మాలు ముస్లిం జీవితంలో విశ్వాసాన్ని మెరుగు పరచేందుకు అల్లాతో అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. అల్లా ఒక్కరే దేవుడు, మహమ్మద్ ప్రవక్త బోదనలను స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ కల్మాలను జపించడం ద్వారా ముస్లింలు అల్లాతో తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. అలాగే ఇస్లాం సిద్ధాంతాల పట్ల తమ కట్టుబాటును ప్రకటిస్తారు.

Also Read: Singer Pravasti: గొడవ సరే.. ఇంతకీ మీ కులం ఏంటి? సింగర్ ప్రవస్తి పై నెటిజన్ల ప్రశ్నల వర్షం

ప్రధానికి దేశ ప్రజల రిక్వెస్ట్
కాశ్మీర్ లో ఇంతటి మారణహోమం సృష్టించిన వారిని అసలు వదిలిపెట్టవద్దని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో మరో సైనిక ఆపరేషన్ తలపెట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేస్తున్నారు. అమాయకులైన పర్యాటకులను చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని కోరుతున్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం