Singer Pravasti: ఎవరూ ఉహించని విధంగా సింగర్ ప్రవస్తి ఆరాధ్య మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో, టాలీవుడ్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో కూడా వివక్షత ఉందా అంటూ కొత్త చర్చకు తెర లేపాయి. ప్రవస్తి చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఇతర సింగర్స్ మాటల దాడి చేస్తున్నారు.
ఏది నిజం? ఏది అబద్ధం ?
గత రెండు రోజుల నుంచి ఈ వివాదం పై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఏది నిజమో ? ఏది అబద్దమో తెలుసుకోకుండా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న సింగర్స్ లో కొందరు ఒకరి తర్వాత ఒకరు ప్రవస్తి పై విరుచుకుపడుతున్నారు. కొందరేమో ఆ అమ్మాయికి బాధ కలిగితేనే కదా చెప్పుకునేది అంటూ సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరి కొందరు నీకు ఇబ్బంది కలిగినప్పుడు చెప్పకుండా, ఎలిమినేట్ అయ్యాక ఇలా ఆరోపణలు చేయడం ఏంటని ప్రవస్తి పై మండి పడుతున్నారు. మరో వైపు ప్రవస్తి ఆరోపణలపై ” తాను చాలా హర్ట్ అయ్యానంటూ ” సింగర్ సునీత వీడియో రిలీజ్ చేసింది. ఈ ఇద్దరి వాదనలు విన్న తర్వాత చిన్న పిల్లల విషయంలో వాళ్ళకి తగ్గట్టే ప్రవర్తించాలి. మీరు జడ్జెస్ అయి ఉండి ఒకర్ని ఎక్కువ .. ఇంకొకర్ని తక్కువ ఎలా చూస్తారంటూ సునీతపై మండిపడుతున్నారు.
Also Read: Threat to Gambhir: చంపేస్తామంటూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు
ప్రవస్తిని టార్గెట్ చేసిన సింగర్స్
ఎప్పుడైతే ప్రవస్తి బయటకొచ్చి ఆరోపణలు చేసిందో అప్పటి నుంచి ఇతర సింగర్స్ ఆమెపై లేని పోనివి చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ” నొప్పి కలిగిన వాళ్ళు మాత్రమే అయ్యో .. అమ్మో అంటారు.. నొప్పి నాది , బాధ నాది .. నాకు ఇక్కడ అన్యాయం జరిగింది .. కాబట్టి నేను మాట్లాడతాను .. నాకు ఎవరి సపోర్ట్ లేదు .. నా వెనుక ఎవరు లేరు .. నేను ఎవరికీ భయపడను అంటూ ప్రవస్తి ” చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే, ఈ మాటల పై ఫిమేల్ సింగర్స్, ప్రవస్తిని తప్పు బడుతూ ” ముందు పెద్ద వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకో, మేము లేచి నిలుచున్నాం అంటే అది కీరవాణి కి ఇచ్చే గౌరవం, నువ్వు దాని గురించి మాట్లాడుతూ మమ్మల్ని అవమానిస్తున్నావ్ ” అంటూ ఇతర సింగర్స్ ఆమె పై మండి పడుతున్నారు.
ప్రవస్తి ఆరాధ్య ది ఏ కులం?
ఇక్కడ ఇంత పెద్ద రచ్చ జరుగుతుంటే జనాలు మాత్రం ప్రవస్తి ఆరాధ్య కులం గురించి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తున్నారు. ఈ వివాదం జరిగిన రోజు నుంచి సింగర్ ప్రవస్తి క్యాస్ట్ గురించి గూగుల్ తెగ వెతుకుతున్నారు. చాలా మంది ‘ప్రవస్తి ఆరాధ్య క్యాస్ట్’ అని సెర్చ్ చేసినట్లు తెలిసిన సమాచారం. ఏదైనా చిన్న వివాదం జరిగితే చాలు .. మన తెలుగు వాళ్ళుకులంపై ఆసక్తి చూపుతుంటారు. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా .. తమిళనాడులో సైతం ప్రవస్తి ఆరాధ్య కులం గురించి గూగుల్ చేయడం షాకింగ్ విషయం.
నెటిజన్ల రియాక్షన్ ఇదే..
ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఎంత మంది ఎన్ని వీడియోలు పెట్టిన జనాలు మాత్రం ప్రవస్తి ఆరాధ్య వైపే ఉన్నారు. దీనికి సంబందించి రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వలన మిగిలిన షో స్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే, ఇప్పటి నుంచి సింగింగ్ రావాలనుకునే వాళ్ళు కూడా వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా సినీ పెద్దలు దీనికి పరిష్కార మార్గం చూపి ప్రవస్తికి న్యాయం చేయాలనీ నెటిజెన్లు కోరుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు