Hanumantha Rao: జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో మెదక్ జిల్లా పర్యాటకులతో పాటు తెలంగాణకు చెందిన పలు ప్రాంతాల్లోని 80 మంది టూరిస్టులు చిక్కుకున్నారు. ఉగ్రదాడి నేపధ్యంలో 27 మంది మరణించిన విషయం తెలిసిందే. ఒక ఫైనాన్స్ నుండి కాశ్మీర్ కు టూర్ వెళ్లగా అక్కడ హోటల్ కే పరిమిత మయ్యారు.
జమ్మూ కాశ్మీర్ కు సమీపంలోని పర్యాటక ప్రాంతం లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 27 మంది మరణించడం, అనేక మంది పర్యాటకులకు గాయాలు కావడంతో అక్కడ మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఉంది. మెదక్ నుండి సోమవారం ఉదయం కాశ్మీర్ చేరుకున్న టూరిస్టులు హోటల్లోనే ఉన్నారు. భయాందోళనలతో బిక్కు, బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మెదక్ కు చిందిన టూరిస్ట్ పొగాకు రామకృష్ణ స్వేచ్ఛ తో మాట్లాడారు.
కాశ్మీర్, పరిసర ప్రాంతాలలో కర్ఫ్యూ వాతావరణం ఉందని, వెల్లడించారు. రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో చెందిన సుమారు 80 మంది టూరిస్టులు జమ్మూకాశ్మీర్ లోని ఒకే హోటల్లో ఉన్నట్లు రామకృష్ణ తెలిపారు.
Also read: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై తీవ్ర ఒత్తిడి!
పర్యాటకులతో మాట్లాడిన మైనంపల్లి హన్మంతరావు
కాశ్మీర్ హోటల్ లో చిక్కుకున్న మెదక్ పర్యాటకులతో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఫోన్లో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. అక్కడి డీజీపీ తో మాట్లాడి టూరిస్టులను సేఫ్ గా హైదరాబాద్ రప్పిస్తున్నట్లు మాజీ కౌన్సిలర్ వెంకటరమణ తెలిపారు.