హైదరాబాద్

Tips for House Construction: హైదరాబాద్ లో రూ. 2 లక్షలకే కొత్త ఇల్లు.. ఇలా ప్లాన్ చేసుకోండి

Tips for House Construction: ప్రతి ఒక్క కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. అయితే ఇంటి స్థలం ఉన్నా, ఆ ఇంటి నిర్మాణంకు అయ్యే ఖర్చు అధికం అనే భావన మనలో ఉంటుంది. అయితే ఇలాంటి వారి కోసమే ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. కానీ కొన్ని కారణాలతో ఆ పథకాలతో లబ్ది పొందలేక ఎందరో కాలం వెళ్లదీస్తూ ఉంటారు. అయితే సరైన ప్లాన్ లేకుండా ఇంటి నిర్మాణంలోకి అడుగు వేశామా.. ఇక అంతే. అందుకే అంటారు పెద్దలు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని.

మన హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం ఉండి కూడా ఇల్లు నిర్మించుకొనేందుకు వచ్చే ఖర్చులకు భయపడి ఇంకా అద్దె భవనాల్లో ఉండే వారు ఎందరో. అందుకే ఇలాంటి వారి కోసం అతి తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణాన్ని ఎలా సాగించాలో చెప్పేందుకే ఈ కథనం. ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే మీకయ్యే ఖర్చు ఎంతో తెలుసా.. కేవలం రూ. 2 లక్షలే. ఇంతకు ఇలా ఇంటి నిర్మాణం ఎలా అని అనుకుంటున్నారా? అయితే ప్లాన్ ఇదే.

ముందుగా మీ వద్ద రూ. 2 లక్షలు సిద్ధంగా ఉంచండి. ఇంకేముంది ఇక రంగంలోకి దిగండి. ఒక గది అందులోనే బెడ్, హాల్, అలాగే చిన్న కిచెన్, బాత్ రూమ్ ఇలా నిర్మించుకొనేందుకు మీకు కావాల్సిన స్థలం అక్షరాలా 150 నుండి 200 స్క్వేర్ ఫీట్ మాత్రమే.

అంచనా ఖర్చు..
ఫౌండేషన్ (Low-cost: రేచ్ పాయిల్స్ లేదా PCC base) – ₹30,000
వాల్ కట్టడం (అంత ఖరీదైన ఇటుకల బదులు – AAC blocks / కంచె బోర్డులు) – ₹40,000
రూఫింగ్ (సిమెంట్ షీట్ / GI షీట్) – ₹40,000
తలుపులు, కిటికీలు (ప్లైవుడ్ / ఫైబర్ / ఇనుము) – ₹20,000
ఫ్లోరింగ్ (సిమెంట్ స్మూత్ ఫినిష్) – ₹10,000
ప్లంబింగ్, బాత్రూం ఫిట్టింగ్స్ – ₹20,000
విద్యుత్, లైట్ పాయింట్లు – ₹10,000
పెయింటింగ్ (చొక్కా కోట్, ఇంటీరియర్ మాత్రమే) – ₹10,000
ఇలా ఖర్చు చేస్తే చాలు, మీకు మొత్తం ఖర్చు ₹1.8 – ₹2 లక్షల వరకు వస్తుంది.

ఈ ఇంటి నిర్మాణ టెక్నిక్స్..
సిమెంట్ బోర్డ్ వాల్స్ తో తక్కువ సమయంలో కట్టవచ్చు, ఖర్చు తక్కువ
షీట్ రూఫ్ + హీట్ ఇన్సులేషన్ టాప్ – వేసవిలో వేడిగా కాకుండా ఉండేందుకు
ప్రీ-కాస్ట్ స్లాబ్ లేకుండా జిగ్‌జాగ్ రూఫ్ డిజైన్
ఇలా ఇల్లు నిర్మించుకుంటే తాత్కాలిక ఇల్లుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కేర్ టేకర్ రూమ్, గార్డెన్ షెడ్, చిన్న వర్క్‌షాప్, లేదా ఒక చిన్న హౌస్ ఫర్ సింగిల్ పర్సన్ ఉండేలా ఉంటుంది.

నిర్మాణానికి సమయం..
స్థలాన్ని సిద్ధం చేయడం (సాఫ్ట్ లెవలింగ్) 1-2 రోజులు
ఫౌండేషన్ & ప్యాడ్ లేయింగ్ 3-5 రోజులు
వాల్ కట్టడం (AAC బ్లాక్స్ లేదా బోర్డులు) – 4-6 రోజులు
రూఫింగ్ (GI/సిమెంట్ షీట్లు) 2-3 రోజులు
తలుపులు, కిటికీలు ఫిట్టింగ్ 1-2 రోజులు
ప్లంబింగ్ & ఎలక్ట్రికల్ వర్క్స్ 2-3 రోజులు
ఫ్లోరింగ్ & పెయింటింగ్ 2-3 రోజులు

Also Read: Ganja Seized: సికింద్రాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత.. ఎంతంటే!

దీనిని బట్టి కేవలం రూ. 2 లక్షలతో మొత్తం నిర్మాణ సమయం 15–20 రోజులు అంటే సుమారు 3 వారాలు పట్టవచ్చు. ఇంకా ప్రీ-కాస్ట్ ప్యానెల్స్ , శెల్టర్ కిట్స్ వాడితే 7 లేక 10 రోజుల్లో పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్న టీమ్ ఉంటే కాస్త ఫాస్ట్ అవుతుంది. వర్షకాలం మినహాయించి నిర్మాణం ప్రారంభిస్తే చాలు వేగంగా మీ కలల ఇల్లు మీ ముందు ఉంటుంది.

అయితే చివరగా ఒక చిన్నమాట.. వివిధ రూపాల్లో ఎన్నో శోధనల తర్వాత ఈ అంచనా విలువను, సమయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం సామాన్య ప్రజానీకం ఇల్లు నిర్మించుకునే స్థాయిని వారికి చేరువ చేసేందుకే ఈ కథనం. మరెందుకు ఆలస్యం జస్ట్ రూ. 2 లక్షలతో మీ ఇంటి నిర్మాణం కేవలం మూడు వారాల్లో పూర్తి చేసుకోండి మరి.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?