Ganja Seized (imagecredit:swetcha)
క్రైమ్

Ganja Seized: సికింద్రాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత.. ఎంతంటే!

Ganja Seized: సికింద్రాబాద్‌ డి టి ఎఫ్, ఎస్ టి ఎఫ్ డి టీమ్‌ల ఎక్సైజ్‌ పోలీస్ సిబ్బంది రెండు కేసుల్లో 5.260 కేజీల గంజాయిని పట్టుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కారు, నాలుగు సెల్ ఫోన్లలను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్‌ ప్రాంతానికి చెందిన మలావత్‌ రాజేందర్‌, ఇండాల్‌ రాథోడ్‌లు అనే ఇద్దరు కలిసి 4.140 కేజీల గంజాయిని కారులో తీసుకొని వచ్చి హైదారాబాద్‌ లో అమ్మకాలు చేపట్టడానికి తీసుకువచ్చారు.

ఆదిలాబాద్‌ శివారు ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో కొందరు వ్యక్తులకు అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటారు. ఇలా చాలసార్లు గంజాయిని నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకవచ్చి అమ్మకాలు జరిపినట్లు నిందితులు విచారణలో వెల్లడిరచినట్లు సికింద్రాబాద్‌ డి టి ఎఫ్ సీఐ సౌజన్య తెలిపారు. ఈసారి కూడ గంజాయిని తీసుకు వస్తున్నట్టు సమాచారం అందుకున్న డి టి ఎఫ్ టీమ్‌ బొయినిపల్లి సమీపంలో కారును నిలిపి తనిఖీలు నిర్వహించారు.

Also Read: Nepali workers Robbery: నమ్మి పనిలో పెట్టుకుంటే.. చివరికి ఎంచేశారంటే!

కారు డిక్కిలో 4.140 కేజీల గంజాయిని పట్టుబ డినట్లు సీఐ వెల్లడించారు. గంజాయితోపాటు ఇద్దరు నిందితులను, వారి వద్దఉన్న మూడు సెల్‌ ఫోన్లను, కారును స్వాధీనం చేసుకొని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో అప్పగించారు. గంజాయిని పట్టుకున్న కేసులో సీఐతోపాటు ఎస్సై శివకృష్ణ, కానిస్టేబుళ్లు రాజు రవి, సునీతలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఈఎస్‌ శ్రీనివాసరావు అభినందించారు.

మరో కేసులో..

కొండాపూర్‌ బటానికిల్‌ పార్కు సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్ టి ఎఫ్ డీ టీమ్‌ ఎస్సై జ్యోతి టీం దాడి నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో వెస్టు బెంగాల్‌కు చెందిన నారాయణ చౌదారి అనే వ్యక్తి ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఒక సెల్‌ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయితోపాటు నిందితుడిని షేర్‌ లింగంపల్లి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయిని పట్టుకున్న కేసులో ఎస్సై జోతితో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ లేఖా సింగ్‌, కానిస్టేబుళ్లు రాజేశ్వర్‌, చంద్రశేఖర్‌,కాశీరావు, శశిలు ఉన్నారు.

Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?