Pahalgam Attack Tragedy (image credit:Twitter)
జాతీయం

Pahalgam Attack Tragedy: కాశ్మీర్ ఉగ్రదాడి సంచలన వీడియో వెలుగులోకి.. చూసారంటే కన్నీళ్ల వర్షమే..

Pahalgam Attack Tragedy: కాశ్మీర్ ఉగ్ర దాడి జరిగిన సమయంలో అక్కడ పర్యాటకులు ఎదుర్కొన్న భయాలు, ఇబ్బందులపై ఓ సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. సరాదాగా ప్రకృతిని ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకులే టార్గెట్ చేసి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డ తీరును యావత్ ప్రపంచం వ్యతిరేకిస్తోంది. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో చూసిన మనవాళ్ల రక్తం మరిగిపోతోందట. ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే..

కాశ్మీర్ పహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటన గురించి మనకు తెలిసిందే. ఇప్పటికే 26 మంది స్వర్గస్తులు కాగా, మరెందరో గాయాలపాలై వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. పర్యాటక ప్రాంతమైన కాశ్మీర్ కు ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రజలకు టూరిస్టులు లేనిదే పూట గడవదు. అలాంటి తరుణంలో భారత పర్యాటక రంగాన్ని దెబ్బతీసేలా ఈ దాడికి పాల్పడి కాసేపు ప్రకృతిని హడలెత్తించారు.

ప్రకృతిని ఆస్వాదిస్తూ పిల్లలతో సరదాగా ఉన్నవారు కొందరు. నూతనంగా పెళ్లి కాగా, సరదా షికారు కోసం వచ్చిన వారు మరికొందరు. కొందరు తమ తల్లిదండ్రులను, పిల్లలను వెంటబెట్టుకొని అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉన్నారు. అప్పటికే పర్యాటకులలో కలిసిపోయిన ముష్కరులు తమ తుపాకులను ఎక్కు పెట్టి మరీ బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి. తల్లిదండ్రులు తమ ప్రాణాల కంటే పిల్లల ప్రాణాలే ముఖ్యమని వారిని కాపాడడంలో ఉన్నారు. మరికొందరు తమ కుటుంబాన్ని రక్షించుకొనే పనిలో ఉన్నారు. కానీ రక్తపిశాచిలైన ముష్కరులు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు.

భారతీయ సైన్యం ఎంటర్.. భయపడ్డ పర్యాటకులు
కాశ్మీర్ పహల్‌గామ్‌ ఉగ్రదాడి గురించి సమాచారం అందుకున్న మన సైన్యం పరుగుపరుగున అక్కడికి వచ్చింది. ముష్కరుల ఆటకట్టించే పనిలో నిమగ్నమైంది. ఆ సమయంలో అక్కడి పర్యాటకులు, మన సైన్యాన్ని చూసి ముష్కరులేనంటూ తెగ భయపడిపోయారు. దీనిని బట్టి అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉన్నదో చెప్పవచ్చు. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Nellore Man Killed in Attack: కాశ్మీర్ ఉగ్రదాడి.. ఏపీ వాసిపై బుల్లెట్ల వర్షం.. శరీరంలో 42 తూటాలు!

నన్ను చంపొద్దు.. మహిళ కన్నీరు
కాల్పులు జరుగుతున్న సమయంలో ఒక రక్షణ ప్రదేశానికి చేరుకున్న కొందరు పర్యాటకులు కూర్చున్నారు. అప్పుడే అక్కడికి మన సైన్యం వారికి భరోసానిస్తూ అండగా నిలిచేందుకు వచ్చింది. ఆ సమయంలో ఓ మహిళ వెంటనే మమ్మల్ని చంపొద్దు అంటూ రోదించిన తీరు మన సైన్యానికి కూడా కన్నీళ్లు తెప్పించింది. లేదు లేదు.. మేము మన సైన్యమే అంటూ ఆ సైనికులు ఎంత చెబుతున్నా, ఆ మహిళ మాత్రం కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా, నెటిజన్స్ .. ప్రధాని జీ.. మీరు వదలవద్దు.. ప్రతీకారం ఉండాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్