KPHB Murder Mystery: సంచలనం సృష్టించిన కేపీహెచ్‌బీ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హతుని భార్య, మరదలు, తోడల్లున్ని అరెస్ట్ చేశారు. కూకట్ పల్లి సబ్ డివిజన్ ఏసీపీ కే.శ్రీనివాస రావు, కేపీహెచ్‌బీ స్టేషన్ సీఐ రాజశేఖర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా జోగిపేట ప్రాంతానికి చెందిన బోయిని సాయిలు, కవిత (29)లు భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే, విభేదాల కారణంగా కొన్నిసంవత్సరాల నుంచి కవిత, సాయిలు వేర్వేరుగా ఉంటున్నారు.
కవిత హైదరాబాద్ లో కూలీ పని చేస్తుండగా సాయిలు సొంతూర్లోనే పని చేసుకుంటూ జీవనం గడుపున్నాడు. ఇదెలా ఉండగా సాయిలు తన కూతురి వివాహాన్ని సోదరి కుమారునితో నిశ్చయించాడు. ఇటీవల ఊరికి వెళ్లినపుడు ఈ విషయం తెలిసి కవిత వ్యతిరేకించింది. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తన కూతురి విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సాయిలు భార్యను హెచ్చరించాడు.
Also Read: Gaddam Prasad Kumar: నీటి సరఫరా మెరుగుపరచండి.. మిషన్ భగీరథ పై స్పీకర్ ఆదేశాలు!
ఈ క్రమంలో సాయిలును ఎలాగైనా చంపేయాలని కవిత నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని చెల్లెలు జ్యోతి, ఆమె భర్త సాధుల మల్లేశ్ తో చెప్పింది. దీనికి సహకరించటానికి జ్యోతి, మల్లేశ్ లు అంగీకరించారు. ఈ క్రమంలో కొన్నాళ్ల తరువాత తిరిగి ఊరికి వెళ్లింది. తనతోపాటు హైదరాబాద్ వస్తే డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చని, కూతురి పెళ్లికి ఉపయోగపడతాయని చెప్పి భర్తను తీసుకుని మల్లేశ్ ఇంటికి తీసుకు వచ్చింది. అక్కడ అంతా కలిసి సాయిలుతో మద్యం తాగించారు.
అతను నిద్రలోకి జారుకోగానే కవిత, మల్లేశ్ కలిసి కరెంట్ షాక్ ఇచ్చారు. దాంతో సాయిలు మేల్కున్నాడు. ఆ వెంటనే కవిత తన రెండు చేతులతో అతని గొంతు, మర్మావయవాలను బలంగా నొక్కింది. అతను కదలకుండా జ్యోతి రెండు కాళ్లపై నిలబడి తొక్కి పెట్టింది. దాంతో సాయిలు అక్కడికక్కడే మరణించాడు. అనంతరం మృతదేహాన్ని జోగిపేటలో నిర్మానుస్య ప్రదేశంలో పూడ్చి పెట్టాలనుకున్న నిందితులు ప్లాస్టిక్ బ్యాగులో మూటగట్టారు.
Also Read: Maoist Encounter: జార్ఖండ్‌లో మల్లీ మ్రోగిన తుపాకి తూటా.. నక్సల్స్ రహిత చర్యలు ఉధృతం!
అనంతరం ఆటోలో అక్కడికి బయల్దేరారు. కాగా, నిర్మానుష్య ప్రదేశంలో నిందితులు దిగి పోవటానికి ప్రయత్నించగా ఆటోడ్రైవర్ వారిపై అనుమానం వ్యక్తం చేశాడు. మూటలో ఏముందని గట్టిగా ప్రశ్నించాడు. దాంతో మృతదేహం ఉన్న మూటతో నిందితులు తిరిగి మియాపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. ఆటోడ్రైవర్ అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన కేపీహెచ్‌బీ పోలీసులు కేసులోని మిస్టరీని ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు