Indian Railways Rapid Train: అదొక ఇంద్రభవనం. అంతేకాదు కదిలే ఇంద్రభవనమే. ఇంద్రభవనం ఏంటి? కదలడం ఏంటి అని అనుకోవద్దు. ఇదొక హై స్పీడ్ రైలు. ఈ రైలు ఒక్కసారి ఎక్కారంటే, మళ్లీ మళ్లీ ఎక్కాల్సిందే. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలు గురించి తెలుసుకుంటే ఔరా అనేస్తారు. అంతేకాదు ఇది రైలు బండి కాదు.. ఇదొక ఇంద్రభవనం అనేస్తారు. ఇంతకు ఈ రైలు ఎక్కడ ప్రయాణిస్తుంది? ప్రారంభం ఎప్పుడో తెలుసుకుందాం.
బీహార్ (Bihar) రాష్ట్రానికి ఈ రైలు ఒక వరం. ఈ రైలు రాజధాని పాట్నాతో పాటు జైనగర్ సరిహద్దు ప్రాంతానికి సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ రైలు పేరే నమో భారత్ రైలు (Namo Bharath Train). ఈ రైలు ప్రయాణం ఎంత లగ్జరీ అంటే, విదేశాలలో గల బుల్లెట్ ట్రైన్ రేంజ్ సదుపాయాలు ఈ రైలులో ఉన్నాయి. ఈ రైలు గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తుంది. రైలు లోపల అన్నీ ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండగా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఈ రైలు అందిస్తుంది.
బీహార్‌లో మొట్టమొదటి ‘నమో భారత్ ర్యాపిడ్ రైలు’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏప్రిల్ 24న తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ జోన్ పరిధిలోని జయనగర్ రైల్వే స్టేషన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. భారతదేశపు సెమీ – హై స్పీడ్ రైలుగా ఈ రైలు నిలవనుంది. సమయం తక్కువ, ప్రయాణం ఎక్కువ ఈ రైలు స్పెషాలిటీ. అలా కూర్చున్నా చాలు, ప్రయాణం ఎంత దూరం సాగినా అలసట రాదు సుమా.
స్పెషల్స్ ఇవే..
ఈ రైలు ప్రయాణీకుల కోసం తేలికైన, ప్యాడెడ్ సీట్లు, ఆటోమేటిక్ తలుపులు, CCTV కెమెరాలు, ఆర్మర్ యాంటీ-కొలిషన్ సిస్టమ్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థను కలిగి ఉంది. అల్యూమినియం లగేజ్ రాక్, LCD డిస్ప్లే ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, డిఫ్యూజ్డ్ LED లైటింగ్, ఎయిర్ కండిషన్డ్ కోచ్ వంటి వాటిని కలిగి ప్రయాణికులను అమితంగా ఆకట్టుకొనే రైలుగా నమో భారత్ ర్యాపిడ్ రైలు నిలుస్తుంది.
Also Read: Viral Video: టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఇలా తయారేంట్రా బాబు..
మహిళలకు ప్రత్యేక కోచ్‌లు
మహిళా సాధికారత దిశగా ఈ రైలు మరో అడుగని చెప్పవచ్చు. నమో భారత్ రైలులో మహిళల సౌలభ్యం, భద్రత కోసం ఒక ప్రత్యేక కోచ్ ఏర్పాటు చేయబడింది. అయితే ఇక్కడ గల నమో భారత్ స్టేషన్ నుండి ప్రయాణీకులు బస్సు, మెట్రో, ఇతర ప్రజా రవాణా విధానాలకు నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదొక రైలుగానే కాకుండా, బీహార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న ఇండియన్ రైల్వే ఒడిలోకి నమో భారత్ రైలు చేరగా, రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ రైలు ఎక్కే అవకాశం మీకు లభిస్తే ఎంచక్కా ఎక్కేయండి.