తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Balmuri venkat on BJP: బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల పేరుతో బీజేపీ స్వార్ధపూరితంగా రాజకీయ కాంట్రవర్సీలు చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో బీజెపీ నేతలు మత విద్వేషాలు పెంచుతున్నారన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు అభివృద్ధి కి ఏమీ చేయలేక, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ లు సైతం మతపరమైన రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ ఓటర్లు బీజేపీకి ఓటు వేయవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి, బిల్లు కేంద్రానికి పంపితే, బీజేపీ నేతలు ఎందుకు మద్ధతు ఇవ్వడం లేదని నిలదీశారు.
బలం లేకున్నా బీజేపీ పోటీ చేస్తుందంటేనే ఇంటర్నల్ ఒప్పందాలు స్పష్టంగా తెలిసిపోతున్నాయన్నారు. హైదరాబాద్ కు ఏమీ తీసుకురాని బీజేపీ నేతలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు.
Also Read: APSWREIS Secretary: ప్రధానమంత్రి అవార్డును అందుకున్న కలెక్టర్.. ఎవరంటే!