Guguloth Kavyashree: పేదరికం ప్రతిభను అడ్డుకోలేదంటారు. సూర్యాపేటకు చెందిన గుగులోత్ కావ్యశ్రీ దీనిని నిజం చేసి చూపించింది. కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా తండ్రి అందించిన ప్రోత్సాహంతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన కావ్యశ్రీ జాతీయ అండర్ 19 టీంకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ కావ్యశ్రీకి చేయూతను అందించటానికి ముందుకొచ్చింది. గుగులోత్ చీన, సుజాత దంపతుల కూతురు కావ్యశ్రీ ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది.
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆమెకు మక్కువ. ఈ నేపథ్యంలో స్కూల్ల్లో ఉన్నప్పటి నుంచే క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. కూతురి ఆసక్తిని గమనించిన గుగులోత్ చీన కూతురిని ప్రోత్సహించాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదిగిన కావ్యశ్రీ తాజాగా అండర్ 19 టీంకు సెలెక్ట్ అయ్యింది.
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత మజిలీ.. పోచంపల్లి పథకంపై ప్రపంచ దృష్టి!
ఈ నేపథ్యంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ తరపున చెంచల్ గూడ సెంట్రల్ జైలు సూపరిండింటెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ సోమవారం తన కార్యాలయంలో కావ్యశ్రీకి 70వేల రూపాయల విలువ చేసే క్రికెట్ కిట్ ను అందచేశారు. ఈ సందర్భంగా కావ్యశ్రీ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మరింతగా రాణించి భారత్ తరపున క్రికెట్ ఆడటానికి కృషి చేస్తానన్నారు. తద్వారా రాష్ట్రానికి మంచి పేరు తీసుకు వస్తానని చెప్పారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు