Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత మజిలీ.. పోచంపల్లి
Miss World 2025 ( image credit: swetcha reporete)
Telangana News

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత మజిలీ.. పోచంపల్లి పథకంపై ప్రపంచ దృష్టి!

Miss World 2025: రాష్ట్రంలో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారు. విజయవంతం చేసి తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అందులోసం రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది.

హైదరాబాద్లో మే 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్-2025 పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ పోటీలకు 140 దేశాల నుంచి మూడు వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిద్వారా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందాల పోటీలను రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో నిర్వహించబోతున్నారు.

 Also Read: MP Konda Vishweshwar Reddy: అసద్ కు కేసీఆర్ బూతుల రోగం అంటుకుందా?.. చేవెళ్ల ఎంపీ సంచనల కామెంట్స్!

ఇందులో భాగంగా వచ్చేనెల 15వ తేదీన అందాల భామలను ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్​ అయిన భూదాన్​ పోచంపల్లికి తీసుకెళ్లనున్నారు. ఇక్కత్​ వస్త్రాల ప్రత్యేకతలను వివరించడంతోపాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం, ప్రత్యేకతలను వివరించేలా చర్యలు చేపడుతున్నారు. చేనేత కార్మికులతో అందాల ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చేనేత కళను ప్రమోషన్ చేసేందుకు క‌ళాకారుల‌తో అతిథులు మాట్లాడేలా ట్రాన్స్ లేట‌ర్లను సైతం నియమించారు.

అనంతరం మిస్ వరల్డ్ లో పాల్గొనే పోటీదారులు ఇక్కత్​ వస్త్రాలు ధరించి ర్యాంపు వాక్​ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గద్వాల్‌ సిల్క్‌, గొల్లభామ కాటన్‌, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్​ ను పోచంపల్లిలో ఏర్పాటు చేయ‌నున్నారు. పోచంపల్లి పర్యటనకు వచ్చిన వారు ఈ స్టాల్స్​ను సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. విదేశీ టూరిస్టుల కోసం తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

 Also Read: Diagnostic Centers: వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లోనూ డయాగ్నస్టిక్ సెంటర్స్!

మే 12న సాగర్ కు మిస్ వరల్డ్ పోటీదారులు
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇతర దేశాల నుంచి వచ్చే పోటీదారులు(అందాల భామల)ను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి ఆ ప్రదేశాలకు అంతర్జాతీయంగా ప్రాచూర్యం కల్పించనున్నారు. వచ్చేనెల 12 వ తేదీన నాగార్జునసాగర్ లోని కృష్ణానది తీరంలో ఉన్న బుద్ధ వనాన్ని అందాల భామలు సందర్శిస్తారు. నాగార్జున సాగర్​ లోని విజయ విహార్​ లో విడిది చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. 15న అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకోనున్నారు.

ప్రధానాలయ పునః నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. b సమయాన్ని బట్టి ఒక డాక్యుమెంటరీ చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. మిస్ వరల్డ్ పోటీల్లో అనేక థీ‌మ్‌లు ఉండగా అందులో ఒక థీమ్ తెలంగాణ హ్యాండ్లూమ్ అనే థీమ్ పెడుతున్నట్లు అధికారులు ెలిపారు. పోటీలకు వచ్చే యువతులు తెలంగాణ చేనేత దుస్తులు ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వస్త్రాలతో సరికొత్త డిజైన్ల తో దుస్తులను తయారు చేసి అందాల భామలతో ధరింపజేసేలా ప్రభుత్వం ప్లాన్​ రూపకల్పన చేసింది

నేడు సాగర్ కు అధికారులు
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా వచ్చే నెల 12న సాగర్ ను పోటీదారులు సందర్శించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? విజయవిహారం, బుద్ధవనంలో వసతుల కల్పన, తదితర అంశాలను పరిశీలించి సంబంధితఅధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేయనున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్మీతా సబర్వాల్ పోటీలను పరిశీలించేందుకు సోమవారం వెళ్తున్నారు. ఆమెకు పోటీల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించడంతో విజయవంతం చేయాలని భావిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?