MP Konda Vishweshwar Reddy: హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ, బీబీపీ మధ్య జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యాలు చేశారు. బీబీపీ అంటే భాయ్.., భాయ్ కే పార్టీ, బాప్, బేటే కే పార్టీ., బాప్.. బేటీకి పార్టీ అంటూ కొండా సెటైర్లు వేశారు. ఈ మూడు పార్టీలు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పాల్గొనని పార్టీలకు అంబేద్కర్ ను వాడుకునే హక్కుందా? అని ఎంపీ ప్రశ్నించారు.
అంబేద్కర్ విధానాల గురించి ఈ మూడు పార్టీలకు మాట్లాడే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఎంఐఎంకు లొంగిపోయాయని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదా అని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. అసదుద్దీన్.. ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్నారని, ఆయనకు కూడా కేసీఆర్ బూతుల రోగం అంటుకుందా అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. పేద ముస్లింలకోసం వక్ఫ్ బిల్లు అవసరమని, వక్ఫ్ అనేది మతానికి సంబంధించిన అంశం కాదన్నారు.
Central on Coaching Centers: కోచింగ్ సెంటర్లపై సీసీపీఏ ఫోకస్… తప్పుడు ప్రకటనలపై కన్నెర్ర!
ఇది దేశానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఎంఐఎం, కాంగ్రెస్ వైఖరి ఉందని ఆయన ఫైరయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకుని హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలని కోరారు. పార్టీలు పక్కన పెట్టి దేశభక్తితో ఓటేయాలని కొండా కోరారు. అధికారం లేకుంటే కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని, ఆయన మాట్లాడేది ఆయనకు అర్థం అయితే చాలంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చురకలంటించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు