Diagnostic Centers: గిరిజన ప్రాంతాల్లోనూ టీ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఉట్నూర్ లో విజయవంతంగా టీ డయాగ్నస్టిక్ సేవలు కొనసాగుతుండగా, కొత్తగా ఏటూరు నాగారం, మన్ననూరు, భద్రాచలంలో హాబ్ లను నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక వీటితో పాటు తాజాగా నారాయణపేట్ , మేడ్చల్ లోనూ టీ డయాగ్నస్టిక్ హబ్ లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే వీటి నిర్మాణ పనులు జరగనున్నాయి.
టీజీ మెడికల్ కార్పొరేషన్ కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. ఎస్టిమేషన్, ఎక్విప్ మెంట్ లిస్టెడ్ కూడా రెడీ అయింది. త్వరలోనే అధికారికంగా నిర్మాణ పనులను ప్రారంభించే అవకావశం ఉన్నదని వైద్యాధికారులు తెలిపారు. ఇక హాబ్ లను లింక్ చేస్తూ 174 స్పోక్ సెంటర్లు(మినీ డయాగ్నస్టిక్ కేంద్రాలు) లను కూడా ఏర్పాటు చేయనున్నారు. హబ్ లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి శాంపిల్ సేకరణ చేయనున్నారు.
ఆయా శాంపిళ్లను టీ డయాగ్నస్టిక్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా రెడీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 157 వెహికల్స్ ను వైద్యశాఖ సమకూర్చుకున్నది. దీంతో పేషెంట్లకు కేవలం 24 గంటల్లోనే రిపోర్టులు ఇవ్వొచ్చని టీ డయాగ్నస్టిక్ కేంద్రాల కో ఆర్డినేటర్లు చెప్తున్నారు.
Also read: Organ transplantation: ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్నారా.. బీ అలర్ట్.. ఇది మీ కోసమే!
టీ హబ్ లలో 2023–24 కంటే 2024–2025 లో మెరుగైన వైద్యసేవలు అందినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టెస్టింగ్ ప్రాసెస్ స్పీడప్ కావడమే కాకుండా, ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించారు. 2023-24లో నెలకు సగటున 2,89,475 మందికి సేవలు అందించగా, 2024-25లో సగటున నెలకు 3,24,982 మందికి సేవలందించారు.
అదే విధంగా 2023-24లో నెలకు సగటున 10,82,537 పరీక్షలు చేస్తే, 2024-25లో నెలకు సగటున 11,19,900 పరీక్షలు చేశారు. వీరిలో 2023-24లో 13,233 మంది ఎక్స్ రే తీయించుకోగా, 2024-25లో 15,929 మంది ఎక్స్‌రే సేవలు వినియోగించుకున్నారు. ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, టిఫా, మామోగ్రామ్ వంటి అన్ని రకాల సేవల్లోనూ 2023-24 కంటే, 2024-25లో మెరుగైన సేవలు అందాయి. 92 శాతం మంది పేషెంట్లకు శాంపిల్ ఇచ్చిన రోజే రిపోర్ట్ ఆన్‌లైన్‌లో రిపోర్టు ఇచ్చినట్లు వైద్యశాఖ తెలిపింది. జనాభా ప్రకారం అన్ని ప్రాంతాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలను విస్తరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది.
పేదలకు ఎంతో ఆర్ధిక ప్రయోజనం: మంత్రి దామోదర రాజనర్సింహా, హెల్త్ మినిస్టర్
టీ డయాగ్నస్టిక్ కేంద్రాల వలన పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహిస్తున్నాం. ప్రైవేట్ లో ఒక పేషెంట్ వైరల్ ఫీవర్ల వంటి టెస్టులకు సగటున 1500 కంటే పైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ టీ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఉచితంగా చేస్తున్నాం. రేడియాలజీ సేవలు కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నాం.
పేషెంట్ అవసరం మేరకు ఈ స్కాన్ లుపూర్తి చేస్తున్నాం. ఎంతో మంది గర్భిణీలకు యాంటీనాటల్ చెకప్ ల పరీక్షలన్నీ టీ డయాగ్నస్టిక్ కేంద్రాల్లోనే పూర్తి చేస్తున్నాం. ప్రభుత్వాసుపత్రులు, మెడికల్ కాలేజీలు, ఎంసీహెచ్ కేంద్రాల్లోని శాంపిలన్నీ ఈ హబ్ లకు చేర్చి సమర్ధవంతంగా టెస్టింగ్ ప్రాసెస్ ను పూర్తి చేస్తున్నాం.ఏజెన్సీ ఏరియాల్లోని పేషెంట్లకు మేలు చేసేందుకు కొత్త సెంటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నాం”