Tirumala (image credit:Twitter)
తిరుపతి

Tirumala: తిరుమలకు వస్తున్నారా? జిల్లా ఎస్పీ హెచ్చరిక మీకోసమే..

Tirumala: తిరుమలకు సొంత కార్లలో వచ్చే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు కీలక సూచనలు చేశారు. ఇటీవల తిరుమలలో పలు కార్లు దగ్ధమైన సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఎస్పీ ఈ మేరకు పలు జాగ్రత్తలు పాటించాలని భక్తులను కోరారు. ఈ జాగ్రత్తలు పాటించి భక్తులు సహకరించాలని ఎస్పీ కోరారు.

ఇటీవల ఎండా కాలంలో తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటని నిపుణులను సంప్రదిస్తే పలు కారణాలు తెలిపినట్లు ఎస్పీ తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్డులో 500 కిలోమీటర్ల పాటు ప్రయాణించిన తర్వాత కార్లు అధిక వేడి చెందడం, మంటలు అంటుకోవడం కొన్ని మెకానికల్ సమస్యలు, పర్యావరణ పరిస్థితులు, డ్రైవింగ్ శైలుల కారణంగా జరుగుతుందని ఎస్పీ అన్నారు.

కార్లకు మంటలు వ్యాపించే కారణాలు..
☀ 500 కిమీ లాంటి ప్రయాణం తర్వాత ఇంజిన్ ఆప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుంది.
☀ తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే, ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్‌కు అధిక వేడి వస్తుంది.
☀ ఘాట్ రోడ్లకు అధిక ఇంజిన్ శక్తి అవసరం.
☀ డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు, ఇది RPM పెరిగి వేడి పెరుగుతుంది.
☀ దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుంది.
☀ తీర్థయాత్రలలో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణం.
☀ ఇది ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తుంది.
☀ పాత వాహనాలు లేదా సరిగా సర్వీస్ చేయని వాహనాలలో:
☀ కూలంట్ లీక్‌లు లేదా తక్కువ స్థాయి కూలంట్
☀ పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు
☀ ఫాల్టీ థర్మోస్టాట్లు
☀ పొడిసిపోయిన ఇంజిన్ ఆయిల్ .. వంటివి ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి, తీవ్రస్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతాయి.

ఎలక్ట్రికల్ సమస్యలు..
☀ ఇంధన పైపుల లీక్‌లు లేదా షార్ట్ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు పుట్టించవచ్చు.
☀ దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు మరియు వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయి.
☀ కొంతమంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తారు.
☀ దీని వలన ఫ్యాన్ పని చేయదు, వేడి బయటకు వెళ్లదు, ఫలితంగా హీట్ సోక్ జరిగి మంటలు రావచ్చు.

Also Read: Southern Railway Jobs: దక్షిణ రైల్వేలో జాబ్స్.. వెంటనే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి!

భద్రతా సూచనలు పాటించండి..
☀ యాత్రకు బయలుదేరు ముందు బండిని సర్వీసింగ్ చేయించండి.
☀ ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, AC ఆయిల్ తనికి చేయించండి.
☀ రేడియేటర్ లీకేజీ తనికి చేయడం .
☀ ఫ్యాన్ బెల్ట్ సరిచూసుకోవడం
☀ బ్యాటరీ లో డిస్టిల్ వాటర్ తనికి చేసుకోవడం, వైర్ల చుట్టూ చేరిన తూప్పు కడిగించుకోవడం.
☀ డ్రైవర్ ప్రతి రెండు గంటలకి ఒకసారి వాహనం ఆపి అయిదు నిమిషాల పాటు నడక చేయడం, స్వల్ప వ్యాయామం చేయడం, బాగా మంచినీరు తీసుకోవడం, టీ మరియు అల్పాహారం సేవించడం చేయాలి..
☀ సెల్ ఫోన్ మాట్లాడడానికి దూరంగా ఉండాలి.
☀ వాహన dash board మీద ధర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండండి, ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే, బండి ఆపి తనికి చేసుకోవాలి.
☀ ఘాట్ ఎక్కే ముందు కనీసం 30 నిమిషాలు వాహనాన్ని విశ్రాంతి ఇవ్వండి.
☀ ఎక్కే సమయంలో AC ఆఫ్ చేయండి.
☀ కూలంట్, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు బాగున్నాయో లేదో ముందే తనిఖీ చేయండి.
☀ బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా, ఇంజిన్ బ్రేకింగ్ వాడండి.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు