Organ transplantation(image credit:X)
హైదరాబాద్

Organ transplantation: ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్నారా.. బీ అలర్ట్.. ఇది మీ కోసమే!

Organ transplantation: ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ తర్వాత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి పేర్కొన్నారు. ఆదివారం హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ , కేర్ ఫర్ యువర్ కిడ్నీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ మార్పిడి, అపోహలు అనే టాపిక్ పై హైదరాబాద్ లో సెమినార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ… అవయవ మార్పిడి చేసుకున్న వారి జీవనశైలి లో మార్పులు తప్పనిసరి అని వెల్లడించారు. ట్రాన్స్ ప్లాంటేషన్ల తర్వాత వచ్చే సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్లకు వివరించాలన్నారు. నిర్లక్ష్​యం చేయకూడదన్నారు. ట్రాన్స్ ‌ప్లాంట్ కు ముందు వారు అనుభవించిన ఆనారోగ్య సమస్యలు.. అవయవ మార్పిడి తరువాత వారు అనుభవిస్తున్న (క్వాలిటీ లైఫ్) మెరుగైన జీవన విధానంపై బేరీజు వేసుకోవాలన్నారు.

Also read: Ranjini: సినీ ఇండస్ట్రీలో లైంగిక అంశాలను ‘మ్యానేజ్’ చేయాలన్న మాలా పార్వతి‌పై రంజని ఫైర్!

భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల భారం పెరుగుతోందన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారన్నారు. వీరిలో కేవలం ఇరవై వేల మంది రోగులకు మాత్రమే కిడ్నీ మార్పిడి జరుగుతుందన్నారు. మిగిలిన వారు డయాలసిస్ ‌లో ఉండి, మార్పిడి కోసం వేచి ఉన్నారని వివరించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 20 శాతం కంటే ఎక్కువ మందిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబల్యం పెరుగుతున్నట్లు వివరించారు. యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ. యశోద హాస్పిటల్స్ ‌లో అధునాతన సాంకేతికత , నిపుణులైన బహుళ వైద్య విభాగల ద్వారా ప్రపంచ స్థాయి మూత్రపిండాల సంరక్షణను అందించడానికి తాము కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ నుండి 280 మంది కిడ్నీ మార్పిడి గ్రహీతలు, డయాలసిస్ రోగులు, కిడ్నీ దాతలు తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!