MLA Arekapudi Gandhi (image credit:tWITTER)
రంగారెడ్డి

MLA Arekapudi Gandhi: ఎమ్మెల్యేపై దాడి అంటూ వాట్సాప్ మెసేజ్.. సోషల్ మీడియాలో వైరల్..

MLA Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కత్తులతో దాడి జరగబోతోందంటూ సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టిన వాట్సాప్​ మెసెజ్​ తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే…ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆదివారం సాయంత్రం గోశాలకు వెళ్లే సమయంలో ఆయనపై అరవింద్​ కుమార్, సాయి రితీష్​ రెడ్డి, కోలా వంశీ, గుళ్ల నాగరాజు అనే వ్యక్తులు కత్తులతో దాడి చేయనున్నారంటూ పలువురికి వాట్సాప్​ మెసెజ్​ వచ్చింది.

వీరిపై గతంలో అక్రమ ఆయుధాల కేసులు ఉన్నాయన్న నేరారోపణలపై కేసులు కూడా నమోదయ్యాయని ఆ మెసెజీలో అగంతకులు పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు అప్రమత్తమయ్యారు. విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. కాగా, అరవింద్​ కుమార్​ మాట్లాడుతూ తమపై గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Also Read: Medchal Crime: బిడ్డకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఒకరు మృతి..

నలుగురి అరెస్ట్​…గంజాయి సీజ్​

వేర్వేరు చోట్ల దాడులు జరిపిన ఎక్సయిజ్ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి 2.366 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పురానాపూల్​ లోని ఓ ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం అందటంతో ఎక్సయిజ్​ స్​టేట్​ టాస్క్​ ఫోర్స్​ సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు.

గంజాయి అమ్ముతున్న చంద్రముఖి, ఆకాశ్​ సింగ్ లను అరెస్ట్​ చేసి వారి నుంచి 1.206 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఇక, ఆసిఫ్​ నగర్​ లోని బాలాజీ బార్​ అండ్ రెస్టారెంట్​ వద్ద గంజాయి అమ్ముతున్న మహ్మద్​ అఫ్జల్, అమిత్ లను అరెస్ట్​ చేసి వారి నుంచి 1.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి ఆయా ఎక్సయిజ్ పోలీస్​ స్టేషన్లలో అప్పగించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!