Medchal Crime: బిడ్డకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఒకరు మృతి..
Medchal Crime (image credit:Canva)
క్రైమ్

Medchal Crime: బిడ్డకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఒకరు మృతి..

Medchal Crime: నాలుగేళ్ల కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతమిది. ఈ సంఘటనలో చిన్నారి మరణించగా తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికంగా తీవ్ర విషాదం సృష్టించిన ఈ సంఘటన బాచుపల్లి ప్రగతినగర్​ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రగతినగర్​ లోని హరిత ఆర్కెడ్​ లో నివాసముంటున్న కృష్ణ పావని (33), సాంబ శివరావు భార్యాభర్తలు. వీరి కూతురు జశ్విక (4). ఇదెలా ఉండగా కొంతకాలంగా కృష్ణ పావని ఆరోగ్య పరమైన సమస్యలతో సతమతమవుతోంది.

ఈ క్రమంలో తనకేదైనా జరిగితే కూతురు అనాధ అవుతుందని భావించిన ఆమె ఈనెల 18న రాత్రి మాజా కూల్​ డ్రింక్​ లో ఎలుకల మందు కలిపి జశ్వికతో తాగించింది. ఆ తరువాత తాను కూడా విషం కలిపిన కూల్​ డ్రింక్​ ను సేవించింది. ఆ మరుసటి రోజు తీవ్ర స్థాయిలో కడుపునొప్పి రావటంతో విషయాన్ని భర్తకు తెలిపింది. వెంటనే సాంబ శివరావు భార్య, కూతురిని కేపీహెచ్​బీలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

Also Read: Reddy Betting App: వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయా? నా అన్వేషణ షాకింగ్ వీడియో!

అక్కడ చికిత్స పొందుతూ జశ్విక తుదిశ్వాస వదిలింది. కృష్ణ పావని ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. బాచుపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, జశ్విక చనిపోవటంపై అపార్ట్​ మెంట్ వాసులు బాధను వ్యక్తం చేశారు. అపార్ట్​ మెంట్​ లో అందరినీ పలకరిస్తూ చిన్నారి జశ్విక ఆడుకునేదని గుర్తు చేసుకున్నారు. తమకిచ్చినా పెంచుకునే వారమని ఆవేదన వ్యక్తం చేశారు.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం