Nizamabad District(image credit:X)
నిజామాబాద్

Nizamabad District: రైతు సంక్షేమానికి పెద్దపీట.. మూడు రోజుల పాటు వర్క్ షాప్!

Nizamabad District: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల గ్రౌండ్స్‌లో జరిగే మహోత్సవాన్ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటిపారుద‌ల‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి & నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రారంభించ‌నున్నారు.

Also read: Sodara: సంపూ ఈసారి నవ్వించడమే కాదు.. ఏడిపిస్తాడట! సంపూ ‘సోదరా’ విశేషాలివే!

మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో రైతులు, వారు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు సైతం ప్రదర్శనలో ఉంచనున్నారు. సుమారు 136 స్టాల్స్‌ ఏర్పాటు చేయ‌నున్నారు. వ్యవసాయ, ఉద్యాన‌వ‌న‌, ప‌శుసంవ‌ర్ధక‌, మ‌త్స్య శాఖ శాస్త్రవేత్తలు, వ్యవ‌సాయ‌ అనుబంధ శాఖ‌ల అధికారులు నూతన వ్యవసాయ పద్ధతులపై మూడు రోజుల పాటు వర్క్ షాపు నిర్వహించ‌నున్నారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకునేందుకు ఇది వేదికగా నిల‌వ‌నుంది.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?