Reddy Betting App: నా అన్వేషణ నుంచి మరో షాకింగ్ వీడియో వచ్చింది. ఈ వీడియోలో రెడ్డి బెట్టింగ్ యాప్ గురించి సంచలన విషయాలను ఈ ప్రపంచ యాత్రికుడు రివీల్ చేశారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్ పేరు చెప్పుకుని ఈ యాప్స్‌ని ఎలా ప్రమోట్ చేస్తున్నారో, సెలబ్రిటీలు ఎవరెవరు ఈ యాప్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారో.. ఇందులో అన్వేష్ చాలా క్లారిటీగా చెప్పాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..
‘‘జగనన్న బెట్టింగ్ యాప్స్.. నిజంగా కులాన్ని కూడా వదలలేదు. ఈ రెడ్డి బెట్టింగ్ యాప్స్ గురించి తెలిసి షాకయ్యాను. హైదరాబాద్‌లో బి.టెక్ విద్యార్థి లక్ష రూపాయలను పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం లక్ష రూపాయల కోసం ప్రాణాలు తీసుకున్నాడు. నిజంగా ఈ రెడ్డి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తుంది ఎవరో తెలుసా? కాజల్ అగర్వాల్. ఏం పోయే కాలం.. ఆమె ఎంత పెద్ద హీరోయిన్. ఆమె భర్త దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆమె దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇన్ని కోట్లు ఉన్నప్పటికీ, రెడ్డి బెట్టింగ్ యాప్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె వ్యవహరిస్తోంది.
Also Read- Balakrishna: ఫ్యాన్సీ నెంబర్ కోసం బాలయ్య ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
ఆ తర్వాత ఈ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తుంది ఎవరో తెలుసా? రైతు బిడ్డ అని బిగ్ బాస్‌లో ఫోజులు కొట్టిన ప్రశాంత్ ఇంకా సొహైల్. బిగ్ బాస్ నుంచి వచ్చాక అదని, ఇదని హడావుడి చేశారు. మరి ఏమైందో ఏమో, బెట్టింగ్ యాప్స్‌పై పడ్డారు. ఇంకా క్రికెటర్లు, హీరోయిన్లు.. ఇలా ఎవ్వరూ తగ్గడం లేదు. సింగర్ గీతా మాధురి భర్త నందు కూడా ఈ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అసలు వీళ్లంతా ఎంత పెద్ద తప్పు చేస్తున్నారనేది వాళ్లకి తెలియడం లేదు. ఆ బెట్టింగ్ యాప్ వాళ్లు.. మేము పలానా రెడ్డి బెట్టింగ్ యాప్ నుంచి వస్తున్నాం. మీ బైట్ కావాలి. అందుకు మీకు రూ. 10 లేదంటే రూ. 20 లక్షలు ఇస్తామని అంటారు. ఆ బైట్‌ని తీసుకుని వాడు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడు. ఆ లింక్ క్లిక్ కొడితే డబ్బులు పోతాయి. ఎన్ని చేసినా ఇంకా ఈ యాప్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా ‘గోవిందా’ బెట్టింగ్ యాప్ గురించి చెప్పాను. ఇంకా ఆ యాప్ వస్తూనే ఉంది. మరి వీళ్ల దగ్గర డబ్బుల్లేక ప్రమోట్ చేస్తున్నారా? అంటే వాళ్ల దగ్గర బోలెడన్ని డబ్బులు ఉన్నాయి.
ఇప్పుడు బి.టెక్ విద్యార్థి చనిపోయాడు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. చిన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు అని వినేవాళ్లం. ఇప్పుడు బెట్టింగ్ బాధితుల మరణాలు అంటూ రోజూ వినాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ నిషిద్ధం అని ఉన్నా కూడా ఏవీ ఆగడం లేదు. ఎవరినని ఆపుతాం. ఇంటికో, సందుకో బెట్టింగ్ యాప్ అన్నట్లుగా మారిపోయింది. నేను ఎన్నని వీడియోలు చేయగలను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఏదో రకంగా బెట్టింగ్ నడవాలి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. లోకల్ బాయ్ నాని, హర్ష సాయి, సన్నీ యాదవ్, సనాతన ధర్మం పేరుతో, అఘోరా, ఇప్పుడు కులం యాప్.. ఇంకా ఎన్ని చూడాలో.
Also Read- Vijayashanti: ఆ శాడిజం ఆపండి.. రివ్యూయర్స్‌పై రాములమ్మ ఫైర్!
చచ్చిపోయిన వైఎస్ఆర్ ఫొటో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో పెట్టి.. వీరి ఆశీస్సులు ఉంటాయని ప్రమోట్ చేస్తుండటం మరింత విడ్డూరం. అసలు కొంచమైనా బుద్ధి ఉందా? వాళ్లు ఎందుకు ఆశీర్వదిస్తారని ఒక్కడైనా ఖండించాలి కదా. పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా. అబ్బే అదేం లేదు. మన క్యాస్ట్ వాడేగా.. అని సొల్లు కబుర్లు మళ్లీ. సెలబ్రిటీలకు కూడా సిగ్గులేదు. ప్రజలను నాశనం చేయడానికి వస్తున్న ఈ బెట్టింగ్ యాప్‌లను ఆపడం చాలా కష్టం. పార్టీ నాయకుడు జగన్ బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తే.. కార్యకర్త, యాంకర్ శ్యామల వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ధర్మం, దైవం, కులం ఇలా అన్ని బెట్టింగ్ యాప్స్ అయిపోయాయి. నిజంగా ఇది వింతే. ప్రపంచంలో ఎక్కడా లేని వింతలన్నీ మన భారతదేశంలో ఉన్నాయి’’ అని ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు