Vijayashanti at Arjun Son Of Vyjayanti Success Meet
ఎంటర్‌టైన్మెంట్

Vijayashanti: ఆ శాడిజం ఆపండి.. రివ్యూయర్స్‌పై రాములమ్మ ఫైర్!

Vijayashanti: రాములమ్మ విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. తన ‘కర్తవ్యం’ సినిమాకు కంటిన్యూ అన్నట్లుగా ఉండే ఈ సినిమాలో విజయశాంతి కుమారుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించారు. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ రెస్పాన్స్‌ని రాబట్టుకుని, సక్సెస్‌ఫుల్‌గానే థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ శనివారం సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. రివ్యూయర్స్‌కి ఇచ్చిపడేశారు. ఎందుకంత పైశాచిక ఆనందం.. బాగున్నా సినిమాను కూడా బాగా లేదని, కావాలని రాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని సపోర్ట్ చేసి మంచి మాటలు రాసిన మీడియాకు, ఈ సినిమాకి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు చేస్తున్నాను. ప్రజలు, ప్రేక్షకులు లేకపోతే ఏ హీరో, హీరోయిన్, ఇంకా ఏ నటులూ లేరు. ఈరోజు సినిమా హిట్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం ప్రేక్షకులకే చెందుతుంది. హీరో, హీరోయిన్లకు జోష్ ఇచ్చి నిలబెట్టేది ప్రేక్షకులే. చాలా సంవత్సరాల తర్వాత శ్రీకాంత్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. తనకి ఏ పాత్ర ఇచ్చినా చక్కగా ఒదిగిపోగలరు. బబ్లు (‘యానిమల్’ ఫేమ్ పృథ్వీ) నా తమ్ముడు. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. డైరెక్టర్ ప్రదీప్ ప్రతి పాత్రను చాలా బ్యాలెన్స్‌డ్‌గా డీల్ చేశారు.

Also Read- Janhvi Kapoor: మగవాళ్లకు పీరియడ్స్‌ వస్తే అణుయుద్ధాలే.. జాన్వీ షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమా క్లైమాక్స్‌లో ఒక సీన్ ఉంది. ఆ సీన్‌ని వేరే హీరో అయితే అస్సలు ఒప్పుకోరు. హీరోలకి ఇమేజ్ విషయంలో చాలా లెక్కలు ఉంటాయి. ఈ సినిమాలో కళ్యాణ్ బాబు అంతా రిస్క్ తీసుకుని లాస్ట్ 20 నిమిషాల్ని అద్భుతంగా మలచడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంత రిస్క్ చేసిన హాట్సాఫ్. డిఓపి రాంప్రసాద్ అందరినీ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో ఫస్ట్ ఫైట్ చూసి అభిమానులు చాలా కొత్తగా ఉంది, అద్భుతంగా చేశారు అక్క అని చెబుతుంటే ఆనందం అనిపించింది. ఈ ఫైట్‌ని చిన్న కుర్రాడు పృథ్వి కంపోజ్ చేశాడు. అలాగే క్లైమాక్స్‌లో ఫైట్ చేయించిన రామకృష్ణ మాస్టర్‌‌కి థాంక్యూ. దేవుడి దయవల్ల ఈ సినిమా ప్రజలకు నచ్చింది. మా కష్టానికి తగిన ఫలితం దొరకడం ఆనందాన్ని ఇచ్చింది.

Arjun Son Of Vyjayanti Success Meet
Arjun Son Of Vyjayanti Success Meet

ఎందుకంత పైశాచిక ఆనందం?
ఈ మూవీని ఖూనీ చేద్దామనుకునే వారిని హెచ్చరిస్తున్నాను. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసే పద్ధతి మార్చుకోండి. ఈ మధ్య ఇది బాగా ఎక్కువైంది. నేను గమనిస్తూనే ఉన్నాను. కొంత మంది కావాలనే సినిమాలను ఇబ్బందిపెడుతున్నారు. ప్రతీ సినిమా ఆడాలనేది మా కోరిక. బాగున్న సినిమాను బాగా లేదని, బాగా లేని సినిమాను బాగుందని ప్రచారం చేసే పద్ధతి మార్చుకోండి? ఇండస్ట్రీని బతకనివ్వండి. మనస్ఫూర్తిగా సినిమాని దీవించడం నేర్చుకోండి. సినిమాని మాత్రం స్పాయిల్ చేయకండి. అందరి హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి నిజమే గెలుస్తుంది. సినిమా నచ్చకపోతే చూడకండి, నిశ్శబ్దంగా ఉండండి. సినిమా ఎంత బాగున్నా.. నచ్చలేదంటూ మూవీని చంపేద్దామని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. థియేటర్లలో సినిమా చూసి అంతా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం. ఎవరైనా మీ మైండ్‌ వాష్‌ చేస్తుంటే, వారి దగ్గర భజన చేసుకోండి. ఇలా చేయటం మాత్రం మంచి పద్ధతి కాదు. మంచి సినిమాలను చంపే హక్కు ఎవరికీ లేదు. సినిమాను చంపేస్తే కొన్ని జీవితాలు పోతాయి. మేమంటే 40 ఏళ్ల జర్నీ చూశాం. వీళ్లంతా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నారు. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను జీవితంలో క్షమించకూడదు. ఇలాంటి చీప్‌ పనులు మానుకోండి.

Also Read- Shine Tom Chacko: ‘దసరా’ విలన్ అరెస్ట్.. ఇక కష్టమే!

జూనియర్ ఎన్టీఆర్ బాగుండాలి
ఈ సినిమాతో నాకూ కళ్యాణ్ రామ్ బాబుకు మంచి బాండింగ్ ఏర్పడింది. తను డే వన్ నుంచి నన్ను అమ్మా అని పిలుస్తూ ఎంతో ప్రేమని అభిమానాన్ని చూపించారు. ఈ సినిమాలో బాబు అద్భుతంగా చేశాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కు థాంక్స్ చెబుతున్నాను. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి ఎంత చక్కని మాటలు చెప్పారు. నన్ను తండ్రి స్థానంలో కూర్చోబెట్టి అమ్మా అని పిలిచారు. మీరు బాగుండాలి బాబు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, కళ్యాణ్ బాబు అభిమానులకు, రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు, నా అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు