Janhvi Kapoor: మగవాళ్లకు పీరియడ్స్‌ వస్తే అణుయుద్ధాలే
Janhvi Kapoor
ఎంటర్‌టైన్‌మెంట్

Janhvi Kapoor: మగవాళ్లకు పీరియడ్స్‌ వస్తే అణుయుద్ధాలే.. జాన్వీ షాకింగ్ కామెంట్స్!

Janhvi Kapoor: మగవాళ్లకు పీరియడ్స్‌ వస్తే అణుయుద్ధాలే జరుగుతాయని అన్నారు ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్. ప్రస్తుతం పీరియడ్స్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆడవాళ్లకు వచ్చే నెలసరి గురించి మగవాళ్లు కొందరు చులకనగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందని జాన్వీ చెప్పుకొచ్చారు. ఇటీవల సమంత (Samantha) కూడా పీరియడ్స్ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. పీరియడ్స్ గురించి బయటకు మాట్లాడటానికి చాలా మంది సిగ్గుపడుతుంటారు. అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా భావిస్తుంటారు. ఈ విషయంలో మహిళలలో మార్పు రావాలి. ఇది సహజ ప్రక్రియ అని అందరికీ తెలిసేలా ప్రవర్తించాలని ఆమె చేసిన వ్యాఖ్యలకు అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు జాన్వీ వంతు వచ్చింది.

Also Read- Vijayshanthi: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ రిజల్ట్‌తో రాములమ్మ గుడ్ ‌బై చెప్పేసినట్టేనా?

నిజంగానే మహిళలు పీరియడ్స్ టైమ్‌లో ఎంతో బాధపడుతుంటారు. పాత కాలంలో పీరియడ్స్ టైమ్‌లో మహిళలను ఇంటికి దూరంగా ఉంచడానికి కారణం, ఆ టైమ్‌లో వారు పనులు చేస్తే మరింతగా అలిసిపోతారని భావించి, అలా చేస్తుండేవారు. కానీ కాలక్రమంలో అది ఒక వింత ఆచారంగా భావించారు. ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేసేవారు. ఈ విషయంలో మహిళలకు ఫ్రీడమ్ అవసరం అన్నట్లుగా క్రమక్రమంగా మార్పు వస్తూనే ఉంది. ఇప్పుడు గ్రామాల్లో తప్పితే పెద్దగా ఎవరూ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ కొందరు మగవాళ్లు మాత్రం, మహిళలు అనుభవించే ఈ బాధను చాలా తేలికగా చూస్తున్నారు. అలా చూసే వారి గురించి జాన్వీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘‘పీరియడ్స్ టైమ్‌లో నాకు విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఆ సమయంలో నేను మాట్లాడే మాట తీరుని బట్టి నేను నెలసరిలో ఉన్నానని ఎదుటివారికి అర్థమైపోతుంది కూడా. ఆ సమయంలో నేను చిరాకుగా మాట్లాడతాను. దానికి ‘ఇది నీకు అవసరమా?’ అన్నట్లుగా మాట్లాడతారు. ఇదే నాకు బాధనిపిస్తుంది. కొందరైతే మహిళలు అనుభవించే ఈ బాధను చాలా చులకనగా చూస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. కానీ కొందరు మగవాళ్లు ఈ సమయంలో ఆడవారిని అర్థం చేసుకుని, వారికి విశ్రాంతి తీసుకోమని చెబుతుంటారు.

Also Read-Ilaiyaraaja: చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ప్రమోషన్స్‌కి వస్తోన్న రాజా.. ఏ సినిమా అంటే?

చులకనగా మాట్లాడే మగవారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. పీరియడ్ టైమ్‌లో పెయిన్ ఎలా ఉంటుందో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ బాధను, మానసిక స్థితిని మగవాళ్లు భరించలేరని నేను కచ్చితంగా చెప్పగలను. ఇంకా చెప్పాలంటే, సపోజ్ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే.. ఆ నొప్పికి అణుయుద్ధాలే వస్తాయేమో..!’’ అని జాన్వీ కపూర్ చెప్పిన మాటలను నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగా చెప్పారంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ, ఆ వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేశారు. మరో రెండు ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్