Vijayshanthi
ఎంటర్‌టైన్మెంట్

Vijayshanthi: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ రిజల్ట్‌తో రాములమ్మ గుడ్ ‌బై చెప్పేసినట్టేనా?

Vijayshanthi: నందమూరి కళ్యాణ్ రామ్ కొడుకుగా, రాములమ్మ విజయశాంతి అతని తల్లిగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమా శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ స్పందనను రాబట్టుకుంది. కానీ, కళ్యాణ్ రామ్ నటన, విజయశాంతి నటన, అలాగే వారిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు ప్రధానబలంగా నిలిచినట్లుగా విమర్శకులు సైతం చెబుతున్నారు. ఈ టాకే ఇప్పుడీ సినిమాను పైకి లేపాలి. ప్రస్తుతానికైతే థియేటర్లలో ఉన్న మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రమైతే ఇదే.

Also Read- Ilaiyaraaja: చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ప్రమోషన్స్‌కి వస్తోన్న రాజా.. ఏ సినిమా అంటే?

ఇక ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్స్‌లో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత ఇక సినిమాలు చేయకూడదని అనుకున్నాను. కానీ, మరొక మంచి పాత్ర వస్తే చేయాలని అనుకున్నాను. నా అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. ఈ సినిమా కథ విన్నాక, నా అభిమానులు కోరుకుంటున్న పాత్ర ఇదేనని నాకు అర్థమైంది. అందుకే ఈ సినిమాలో పాత్ర కోసం ఎంత కష్టమైనా, ఇష్టంగా చేశాను అని చెప్పారు. అంటే, ఈ సినిమా తర్వాత మ్యాగ్జిమమ్ విజయశాంతి సినిమాలు చేయదనేలా అంతా ఫిక్స్ అయ్యారు. కానీ, ఆమె పాత్రకి మంచి పేరే వస్తుంది కానీ, ఆమె ఊహించుకున్న సక్సెస్ దగ్గర ఈ చిత్రం నిలబడుతుందో, లేదో చూడాలి.

ఒక వేళ నిలబడలేకపోతే, మళ్లీ రాములమ్మ సినిమా చేస్తుందా? లేదంటే, ఇదే లాస్ట్ సినిమా అని గుడ్ బై చెప్పేస్తుందా? రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో ఇకపై సినిమాలు చేయను. అయినా చేసేంత టైమ్ నాకు ఉండదు. ఎమ్మెల్సీగా ఎంపికయ్యాను కాబట్టి, ప్రజలకు సేవ చేసే పనిలో బిజీగా ఉంటాను. ఇకపై సినిమాలు కూడా చేయను అని ఈ లేడీ సూపర్ స్టార్ క్లారిటీగా చెప్పేసింది. మరి, ఏ నటి అయినా బ్లాక్‌బస్టర్‌ సినిమాతో ముగించాలని అనుకుంటారు. క్రికెట్‌లో కూడా విన్నింగ్ షాట్‌కు ప్లేయర్ భారీ సిక్స్ కొట్టాలని చూస్తాడు. అలాగే, రాములమ్మ కూడా ఒక మంచి లేడీ ఓరియంటెడ్ సినిమాతో సినీ కెరీర్‌ని ముగిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఈ దిశగా భవిష్యత్‌లో రాములమ్మ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే, ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లుగానే భావించవచ్చు.

Also Read- Shivathmika Rajashekar: శివాత్మిక కూడా స్టార్ట్ చేసిందిగా.. అబ్బ.. ఏముందిరా బాబూ!

విజయశాంతి విషయానికి వస్తే.. ప్రస్తుతం పాలిటిక్స్‌తో బిజీగా ఉంది కానీ, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌డమ్‌ని అనుభవించారు. లేడీ సూపర్ స్టార్ బిరుదును ఆమెకు ప్రేక్షకులు ఇచ్చారంటే, నటిగా ఆమె ప్రస్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోల సరసన నటిస్తూనే, వారికి సరి సమానంగా తనకంటూ ఓ ప్రత్యేక మార్గాన్ని ఆమె క్రియేట్ చేసుకున్నారు. అదే, ఆమె గురించి ఈ రోజుకి స్పెషల్‌గా చెప్పుకునేలా చేస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు