Ilaiyaraaja: చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ప్రమోషన్స్‌కి రాజా..
Ilaiyaraaja
ఎంటర్‌టైన్‌మెంట్

Ilaiyaraaja: చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ప్రమోషన్స్‌కి వస్తోన్న రాజా.. ఏ సినిమా అంటే?

Ilaiyaraaja: ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతానికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఆయన పాట వినకుండా మానవుడికి రోజు గడవదు. జనరేషన్స్‌తో పని లేకుండా ఇప్పటికీ తన సంగీతంతో ప్రేక్షకులని అలరిస్తున్న సంగీత దర్శకుడాయన. అయితే ఈ మధ్య ఇళయరాజా పేరు ఎక్కువగా కేసులు అనే కోణంలో బాగా హైలెట్ అవుతుంది. తన అనుమతి లేకుండా ఎవరైనా తన సంగీతంలో వచ్చిన పాటలను, సంగీతాన్ని వాడితే.. వారిపై రూ. కోట్ల రూపాయలకు దావా వేస్తున్నారు ఇళయరాజా. మరి ఆయన ఉద్దేశ్యం ఏమిటనేది పక్కన పెడితే.. ఈ విషయంలో మాత్రం ఆయన అభిమానులు కూడా కాస్త నిరాశగా ఉన్నారు. రీసెంట్‌గా వచ్చిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీమ్‌పై కూడా ఆయన కేసు పెట్టారు. సరే ఆ సంగతి పక్కన పెడితే..

Also Read- Arjun Son Of Vyjayanthi: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చూసిన కళ్యాణ్ రామ్ కొడుకు స్పందనిదే!

ఇసైజ్ఞాని ఇళయరాజా చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమా ప్రమోషన్‌కి హాజరవుతుండటం.. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఇళయరాజా సమయం దొరికినప్పుడల్లా తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తూనే ఉన్నారు. కానీ, ఆ సినిమాల ప్రమోషన్స్‌కి మాత్రం ఎప్పుడూ హాజరు కాలేదు. ఫస్ట్ టైమ్ ఆయన తను సంగీతం అందించిన తెలుగు సినిమా టీజర్ లాంచ్ వేడుకకు హాజరవుతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటని అనుకుంటున్నారా? రూపేష్ హీరోగా, నిర్మాతగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థపై నిర్మిస్తున్న ‘షష్టిపూర్తి’ సినిమా.

సీనియర్ నటీనటులు రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలలో నటిస్తుండగా, రూపేష్, ఆకాంక్ష సింగ్ యంగ్ జంటగా కనిపించనున్నారు. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని శనివారం హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇళయరాజా కూడా హాజరవుతున్నట్లుగా టీమ్ వెల్లడించింది. అంతే, ఇక రాజాపై వార్తలే వార్తలు. వాస్తవానికి ఈ సంగీత దిగ్గజం ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరు కావాల్సిన అవసరం లేదు. కానీ, సినిమాపై ఉన్న నమ్మకమో, లేదంటే ఈ సినిమా ఆయన హార్ట్‌కు దగ్గరైందో తెలియదు కానీ, చాలా కాలం తర్వాత ఆయన ఓ తెలుగు సినిమా ఈవెంట్‌కు హాజరవుతున్నారు.

Also Read- Retro Trailer: అందమైన, అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తారు.. ట్రైలర్ అదిరింది

ఇక ఈ సినిమాకు సంగీతం అందించడానికి ఇళయరాజా దగ్గరకు వెళ్లడానికి చాలా పెద్ద కథే జరిగిందని చిత్ర దర్శకుడు ప్రదీప్ ఆ మధ్య ఓ స్టేజ్‌పై ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకున్న మరో విశేషం ఏమిటంటే.. ఇళయరాజా కంపోజిషన్‌లో మరో సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి ఓ పాటను రాయడం. ఇంకో విశేషం ఏమిటంటే, ఇళయరాజా స్వరాలు సమకూర్చిన, కీరవాణి రాసిన ఈ పాటను రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేయడం. మొత్తంగా అయితే విడుదలకు ముందే ‘షష్టిపూర్తి’ సినిమా ఇలా సంగీత దిగ్గజాల రూపంలో వార్తలలో హైలెట్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Messi India Visit: మెస్సీ భారత్‌కు ప్రయాణించిన విమానం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారేమో!

Telangana DGP: ఉప్పల్‌లో సీఎం – మెస్సీ మ్యాచ్.. కీలక సూచనలు చేసిన డీజీపీ శివధర్ రెడ్డి

Tech Layoffs 2025: 2025లో టెక్ రంగంలో భారీ ఉద్యోగ కోతలు.. లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు

Kishan Reddy: కోల్ సేతు విండోకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఇక విదేశాలకు చెక్ పడేనా..!

Messi Hyderabad Visit: కోల్‌కత్తా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్.. మెస్సీ కోసం భారీ భద్రత