Retro Trailer: ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ‘కంగువా’ చిత్రం ఖంగుతినిపించడంతో స్టార్ హీరో సూర్య (Suriya), ఇకపై వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తానని ఇటీవల అభిమానులకు మాటిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ‘రెట్రో’ (Retro) అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. సూర్య సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జోజూ జార్జ్, నాజర్, జయరామ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 1న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read- DSP Vizag Concert: ఎట్టకేలకు అనుమతి.. దేవిశ్రీ కన్సర్ట్‌కు లైన్ క్లియర్
2 నిమిషాల 42 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం చాలా కొత్తగా ఉండటమే కాకుండా, సరికొత్త సూర్యను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకు సూర్య ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఇప్పుడీ చిత్రంలో ఆయన మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే పూజా హెగ్డే కూడా ఫస్ట్ టైమ్ డీ గ్లామరైజ్డ్‌గా ఈ చిత్రంలో కనిపిస్తుంది. వెల్‌కమ్ వెల్‌కమ్.. 10 నిమిషాల్లో మంచి జింక మాంసం రెడీ అంటూ విలన్ చెబుతున్న డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. ఆ లోపు ఓ షో చెయ్యమని విలన్, సూర్యను అడగగానే వెరైటీ గడ్డంతో సూర్య ఎంట్రీని చూపించారు. ‘షో’ చేద్దామా.. అంటూ సూర్య చెప్పిన డైలాగ్ అనంతరం రేసీ స్క్రీన్‌ప్లేతో ఈ ట్రైలర్ దూసుకెళ్లింది. ఒకవైపు పొలిటికల్ డైలాగ్స్, మరో వైపు ప్రకాశ్ రాజ్ ‘అబద్దం’ అంటూ ఒకరిని నమ్మకపోవడం, జయరామ్ విలక్షణమైన నవ్వుతో ట్రైలర్ ముందుకు నడిచింది. (Retro Trailer Talk)
సూర్య, పూజా హెగ్డే (Pooja Hegde)ల మధ్య వచ్చే డైలాగ్స్‌తో సూర్య ఇందులో చేసే పాత్రని పరిచయం చేశారు. బుద్ధ, రాక్షసుల పోలికలతో పూజాని, తనని సూర్య వర్ణించుకోవడం, ఆ తర్వాత యాక్షన్ సీన్, ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు అని సూర్య కోసం విలన్ వేచి చూడటం, సూర్య వచ్చి.. ‘అందమైన అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తారు’ అని డైలాగ్ ట్రైలర్‌ను గ్రిప్పింగ్‌గా నడిపించాయి. అక్కడి నుంచి అంతా యాక్షన్ సీన్స్‌తోనే ట్రైలర్‌ను నింపేశారు. ఓవరాల్‌గా అయితే సూర్య నుంచి ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదనేలా, సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఈ సినిమా ఇస్తుందనేలా చెప్పడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయింది.
Also Read- Mad Square OTT: ఖతర్నాక్ కామెడీ బొనాంజా.. ఓటీటీలో ఎప్పుడంటే?
ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికేట్‌ను రాబట్టుకుంది. 2 గంటల 48 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని ఇకపై ఓ రేంజ్‌లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్‌తో పాటు లవ్, ఎమోషన్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు