Rockstar Devi Sri Prasad
విశాఖపట్నం

DSP Vizag Concert: ఎట్టకేలకు అనుమతి.. దేవిశ్రీ కన్సర్ట్‌కు లైన్ క్లియర్

DSP Vizag Concert: రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్ కార్యక్రమం ఏప్రిల్ 19న విశాఖపట్నంలో జరగాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి విశాఖ పోలీసులు భద్రతా కారణాలతో అనుమతులు నిరాకరించారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ, నిర్వాహకులలో ఆందోళన మొదలయ్యాయి. రెండు రోజులుగా ఈ కన్సర్ట్ విషయంలో ఏం జరుగుతుందో అని అంతా వేచి చూస్తున్నారు. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో పెట్టిన 10వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. మరి వారు ఎన్ని టికెట్స్ అమ్మారో ఏంటో గానీ.. మొత్తంగా అయితే భారీగా ఈ మ్యూజికల్ నైట్‌కు జనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ కన్సర్ట్ నిర్వహణ నిమిత్తం అనుకున్న విశ్వనాథ్ కన్వెన్షన్‌లో అంతమంది సరిపోరు. అందులోనూ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లోని వాటర్ వరల్డ్‌లో జరిగిన ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వస్తున్నారు.

Also Read- Mad Square OTT: ఖతర్నాక్ కామెడీ బొనాంజా.. ఓటీటీలో ఎప్పుడంటే?

మ్యూజికల్ కన్సర్ట్ నిర్వాహకులు మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా ఇప్పటి వరకు నాలుగు సార్లు విశాఖ పోలీసులు అనుమతులను ఇవ్వకుండా తిరస్కరిస్తూ వస్తున్నారు. మెయిన్ రీజన్ మాత్రం భద్రతా సమస్యలే అని పోలీసులు చెబుతున్నారు. కనీసం పోర్ట్ స్టేడియంలో అయినా అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు పట్టుబట్టారు. కానీ అక్కడ సామర్ధ్యం 3వేల మందికి మించి పట్టరు. దీంతో అక్కడ కూడా కుదరదని చెప్పేశారు. 10వేల టికెట్స్ అమ్మి, 3వేల మంది పట్టే చోటులో ఎలా కన్సర్ట్ నిర్వహిస్తారంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ విశాఖలో జరగడం అనేది అనుమానంగానే ఉంది.

మరోవైపు టికెట్స్ కొనుక్కున్న వారంతా ఒత్తిడి చేస్తుండటంతో, నిర్వాహకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కన్సర్ట్ నిమిత్తం రెండు రోజుల ముందే దేవిశ్రీ ప్రసాద్ కూడా వైజాగ్ చేరుకున్నారు. దీంతో అసలు ఏమవుతుందో అనేలా పరిస్థితి మారిపోయింది. అయితే, చివరి నిమిషంలో పోలీసులు ఈ మ్యూజికల్ కన్సర్ట్‌కు అనుమతిని ఇచ్చారు. కార్యక్రమానికి ఇంకొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉందనగా పోలీసులు ఈ కన్సర్ట్‌కు కొన్ని కండీషన్లతో అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

Also Read- Urvashi Rautela: సౌత్‌లో నాకు గుడి కట్టాలి.. డౌటే లేదు ఇది అదే!

కేవలం ఈ కన్సర్ట్‌కు 9800 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆనందం’ సినిమా అప్పటి నుంచి ఈవెంట్స్ చేయడం, ఆడియో లాంచ్ వంటి అనేక కార్యక్రమాలు అలవాటుగా చేస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియంలో స్టేజ్ ఆకర్షించే దిశగా ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు కన్సర్ట్ జరగబోయే స్పోర్ట్స్ స్టేడియం కూడా ఇదే విధంగా గ్రాండ్‌గా ఉంటుంది. ఏసీటీసీ వారు అద్భుతంగా కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. ఇటీవల కర్ణాటకలో చేసిన షో గ్రాండ్ సక్సెస్ అయింది. అతిరథ మహారధులు ఆ వేడుకను చూసేందుకు వచ్చారు. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను.

నాకు వైజాగ్‌తో చాలా మంచి అనుబంధం ఉంది. ‘రంగస్థలం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి పలు సినిమాలను విశాఖలో చేశాం. అందరూ నాపై చూపించే ప్రేమే నా ఎనర్జీ సీక్రెట్. ప్యూర్ లవ్ మాత్రమే నా శక్తి. దేశ విదేశాల్లో షో లు చేశాను. ప్రతి ఒక్కరి లైఫ్‌లో అప్ అండ్ డౌన్‌లు ఉంటాయి. కానీ నా లైఫ్‌లో అన్నీ అప్‌లు మాత్రమే ఉన్నాయి. నాకు ఎవరైనా చెడు చేస్తే.. అలాంటి వారంతా నాకు చిన్న పిల్లలుగా కనిపిస్తారు. అప్పుడు దేవుడిపై భారం వేసి సక్సెస్ అవుతుంటానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం