Shivathmika Rajasekhar
ఎంటర్‌టైన్మెంట్

Shivathmika Rajashekar: శివాత్మిక కూడా స్టార్ట్ చేసిందిగా.. అబ్బ.. ఏముందిరా బాబూ!

Shivathmika Rajashekar: శివాత్మిక రాజశేఖర్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగానే పరిచయం. ఈ రెండు సినీ ఇండస్ట్రీలలో ఆమె కొన్ని సినిమాలు చేశారు. కానీ, ఏదీ ఆమెకు అనుకున్నంతగా సక్సెస్‌ని మాత్రం ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఇటీవల వచ్చిన ‘రంగమార్తాండ’ సినిమాలోనూ శివాత్మికకు మంచి పాత్రే పడింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన రిజల్ట్‌ని అందుకోకపోవడంతో, ఆమె పాత్ర హైలెట్ కాలేదు. అయినా సరే, తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. ఇంతకీ శివాత్మిక ఎవరో తెలుసుగా?

Also Read- Ilaiyaraaja: చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ప్రమోషన్స్‌కి వస్తోన్న రాజా.. ఏ సినిమా అంటే?

సినీ కపుల్ జీవిత, రాజశేఖర్‌ దంపతుల (Jeevitha and Rajasekhar Couple) కుమార్తె. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు శివాని, మరొకరు శివాత్మిక. వీరిద్దరూ నటిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. కానీ ఇద్దరికీ ఏ కోశాన అదృష్టం కలిసిరాలేదు. ఇద్దరిలో ఎవరికైనా ఒక్క సరైన హిట్ పడి ఉంటే, ఇండస్ట్రీలో రాజశేఖర్ ఫ్యామిలీ పేరు కూడా బాగా వైరల్ అవుతూ ఉండేది. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం శివాని (Shivani), శివాత్మిక ఇద్దరూ మంచి పాత్రల కోసం చూస్తున్నారు. కొన్ని మంచి సినిమాలలో వారికి అవకాశం వచ్చినా, కొన్ని ఇంటిమేట్ సీన్స్ చేయాల్సి ఉండటం వల్ల వారు ఆ పాత్రలకు నో చెప్పినట్లుగా ఇటీవల చెప్పుకొచ్చారు.

Also Read- Arjun Son Of Vyjayanthi: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చూసిన కళ్యాణ్ రామ్ కొడుకు స్పందనిదే!

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వారు వదులుతున్న ఫొటోలను చూస్తుంటే, అందుకు రెడీ అని సిగ్నల్ ఇస్తున్నట్లుగా ఆ ఫొటోలు ఉండటం విశేషం. ఇద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ.. దర్శకనిర్మాతల కంట్లో పడేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. తాజాగా శివాత్మిక తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన వారంతా అబ్బ.. శివాత్మిక ఏముందిరా బాబూ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఆసక్తికరంగా రెస్పాండ్ అవుతుండటం విశేషం. ఈ గ్లామర్ ప్రదర్శన ఏదో అప్పుడే చేసి ఉంటే, ఇండస్ట్రీలో నిలదొక్కుకునే వారుగా.. అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

">

వారు అలా కామెంట్స్ చేయడానికి రీజన్ లేకపోలేదు. ఈ ఇద్దరు హీరోయిన్లు కొన్ని మంచి ప్రాజెక్ట్స్‌ని చేజేతులా వదులుకున్నారు. ‘ఉప్పెన’ సినిమాలో మొదట అవకాశం శివాని రాజశేఖర్‌కే వచ్చిందట. కానీ అందులో కొన్ని సీన్లు చేయలేక, ఆ అవకాశాన్ని జారవిడుచుకుంది. అందుకే అదృష్టం ఉండాలని అనేది. ఈ జీవితా రాజశేఖర్ కుమార్తెలకు (Rajasekhar Daughters) ప్రస్తుతం అదే కరువైంది. ఒక్కసారి అదృష్టం వారి వెంట ఉంటే మాత్రం కచ్చితంగా ఈ అందంతో చక్రం తిప్పేయడం కాయం. అందులో డౌట్సే అవసరం లేదు. ఇంకా డౌట్స్ ఉంటే ఈ ఇద్దరు భామల ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లను ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు