Shine Tom Chacko
ఎంటర్‌టైన్మెంట్

Shine Tom Chacko: ‘దసరా’ విలన్ అరెస్ట్.. ఇక కష్టమే!

Shine Tom Chacko: మలయాళ నటుడు, టాలీవుడ్‌లో ‘దసరా’ సినిమాలో విలన్‌ (Dasara Movie Villain)గా చేసిన షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko)ను ఎట్టకేలకు కేరళ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) తీసుకుంటున్నాడని తెలిసి పోలీసులు ఆయన బస చేస్తున్న హోటల్‌కి వెళ్లగా, పోలీసులు వస్తున్న విషయం తెలుసుకుని షైన్‌ టామ్‌ చాకో పారిపోయినట్లుగా గురు, శుక్రవారాల్లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. పోలీసులు వెళ్లే సమయానికి షైన్‌ టామ్‌ చాకో గోడ దూకి పారిపోతున్నట్లుగా కొన్ని వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఆయనకు సమన్లు జారీ చేసి, విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read- Janhvi Kapoor: మగవాళ్లకు పీరియడ్స్‌ వస్తే అణుయుద్ధాలే.. జాన్వీ షాకింగ్ కామెంట్స్!

డ్రగ్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలతో తనకు సమన్లు జారీ చేయడంతో, షైన్‌ టామ్‌ చాకో శనివారం విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులు ఆయనని ప్రశ్నించారు. విచారణ అనంతరం షైన్‌ టామ్‌ చాకోను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరుస్తున్నామని పోలీసులు తెలియజేశారు. శనివారం ఉదయం షైన్‌ టామ్‌ చాకో తన న్యాయవాదితో కలిసి ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. (Shine Tom Chacko Arrested)

అసలేం జరిగిందంటే.. కొచ్చిలోని ఓ హోటల్లో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న నార్కోటిక్‌ పోలీసుల ఒక గ్రూపుగా ఏర్పడి అక్కడ రైడ్‌ జరిపారు. ఈ పోలీసుల బృందం హోటల్‌కు వస్తున్నారని ముందే తెలుసుకున్న నటుడు షైన్‌ టామ్‌ చాకో, మూడో అంతస్తులో ఉన్న కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి, అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పారిపోయారు. షైన్‌ టామ్‌ చాకో పారిపోతున్న విజువల్స్ వీడియోల రూపంలో సోషల్ మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. ఇది బుధవారం ఉదయం జరిగినట్లుగా తెలుస్తుంది.

Also Read- Shivathmika Rajashekar: శివాత్మిక కూడా స్టార్ట్ చేసిందిగా.. అబ్బ.. ఏముందిరా బాబూ!

మరో వైపు షైన్‌ టామ్‌ చాకో‌పై విన్సీ సోనీ అలోషియస్‌ (Vincy Sony Aloshious) అనే నటి ఫిర్యాదు కూడా ఇదే సమయంలో వైరల్ అవుతుంది. సినిమా సెట్‌లో డ్రగ్స్ సేవించి, తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని విన్సీ సోనీ అలోషియస్‌ కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌తో పాటు ‘అమ్మ’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. విన్సీ సోనీ ఆరోపణలతో మరోసారి మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే షైన్‌ టామ్‌ చాకో ఇక సినిమాల్లో నటించడం కష్టమే అనేలా టాక్ మొదలైంది. డ్రగ్స్, లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి ఆయన బయటికి వచ్చినా, ఆయనకు అవకాశాలు కష్టమే అనేలా అంతా మాట్లాడుకుంటున్నారు. చూద్దాం.. షైన్‌ టామ్‌ చాకో భవిష్యత్ ఎలా ఉండబోతుందో..!

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!