Viral News: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే తయారువుతున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
Also Read: MLC Local body elections: హైదరాబాద్ లో ఎలక్షన్స్.. రెండే పోలింగ్ బూత్ లు.. అంతా టెన్షన్ టెన్షన్!
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని రక రకాల ప్రయత్నాలు చేస్తారు. వీటిని వెంటనే సోషల్ మీడియాలోకి షేర్ చేస్తారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ పెళ్లికి సంబందించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఫోటో ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది. ఇది చూశాక .. మీరు కూడా షాక్ అవ్వడం పక్కా..! ఇంతకీ, దానిలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి మొదలెట్టిందిరా మళ్లీ.. పాటతో రెచ్చిపోయిందిగా.. వీడియో వైరల్
సాధారణంగా మనం పెళ్లికి వెళ్లినప్పుడు నవ వధూవరులను చూసి, భోజనం చేసి, చదివింపులను చదివించి వస్తారు. అయితే, ఇక్కడ మాత్రం అంతా రివర్స్ లో ఉంది. పెళ్లికి వెళ్లిన వారందరి పై పూల వర్షం కురిపించారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో పాటు బంధువులు కూడా డబ్బులు వెదజల్లారు. పెళ్లికి వెళ్లిన చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు డబ్బును ఏరుకుంటున్నారు. రూ. 200 నోట్లు, రూ 100 నోట్లు, రూ. 50 నోట్లు, రూ. 10 నోట్లను పూల వర్షంలా కురిపించారు. తెలుగు పెళ్లిల్లో ఇలాంటివి ఉండవు. కానీ, ఉత్తర ప్రదేశ్ లో పెళ్లి బరాత్ లో ఈ ఆచారం ఇప్పటికి కొనసాగుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు