Online Betting ( Image Source: Twitter)
క్రైమ్

Online Betting: ప్రాణం తీసిన బెట్టింగ్? ఏపీలో మరో మరణం..

Online Betting: బెట్టింగ్ యాప్స్ వలన ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీని బారిన పడిన వారు లక్షల్లో ఉన్నారు. రోజు రోజుకు ఈ ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడితే ఉన్న డబ్బులను పోగొట్టుకోవడం తప్ప వచ్చేది ఏం ఉండదు. కాబట్టి, ఆన్లైన్ గేమ్స్ ఎవరు ఆడకండి.. ఒక్కసారి ఈ బెట్టింగ్ మాయలోకి వెళ్తే బయటకు రావడం చాలా కష్టం. గత కొన్ని నెలల నుంచి వీటిని ఎలా అయిన అరికట్టాలను పోలీస్ శాఖ వారు రంగంలోకి దిగి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు.

Also Read: Suryapet Student Died: బీటెక్ హాస్టల్ లో షాకింగ్ ఘటన.. రక్తపు మడుగులో విద్యార్థిని.. ఏం జరిగింది?

డబ్బు ఉన్న వాళ్ళ కంటే, లేని వాళ్ళు ఈ ఆటలకు అడిక్ట్ అయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చెత్త ఆటలకు బానిసైతే జీవితంలో ఎప్పటికి ఎదగలేరు. అయితే, తాజాగా రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read: Viral: ఎక్సామ్ పేపర్లో కరెన్సీ నోట్లు పెట్టిన స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కవాల్సిందే!

డబ్బులు పెడితే, పెట్టిన దానికి ఎక్కువ వస్తాయని ఆశపడి శ్రీ సత్య సాయి జిల్లాలో ఓ యువకుడు  బెట్టింగ్ వేశాడు. తీరా డబ్బు మొత్తం పోవడంతో  జై చంద్ర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను పరిగి మండలం పైరేట్ గ్రామంలో నివాసముంటున్నాడు. ఫ్రెండ్స్ కలిసిన సమయంలో కూడా ఆన్లైన్ యాప్స్లో బెట్టింగ్ వేస్తూ ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. అతని షర్ట్ పై ఆన్లైన్ గేమ్ లు, యాప్స్ డౌన్లోడ్ చేయొద్దంటూ రాసుకున్నాడు. ప్రస్తుతం, మృతి చెందిన యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పోలీసులకు సమాచారం అందివ్వగా కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!