Viral: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే తయారువుతున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
Also Read: Mahesh Babu: రీ-రిలీజ్ కి రెడీ అవుతోన్న మహేష్ బాబు డిజాస్టర్ మూవీ.. ఈ సారైనా హిట్ కొడుతోందా?
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని రక రకాల ప్రయత్నాలు చేస్తారు. వీటిని వెంటనే సోషల్ మీడియాలోకి షేర్ చేస్తారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ పరీక్ష పేపర్ కి సంబందించిన ఫోటో ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది. ఇది చూశాక .. మీరు కూడా షాక్ అవ్వడం పక్కా..! ఇంతకీ, దానిలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Arjun Son Of Vyjayanthi: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చూసిన కళ్యాణ్ రామ్ కొడుకు స్పందనిదే!
కర్ణాటక చిక్కొడిలో జరిగిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి జవాబు పత్రాల్లో ఆన్సర్స్ కు బదులు, నోట్లు ఉండటంతో పేపర్ కరెక్ట్ చేసే ఉపాధ్యాయుడు ఖంగుతిన్నాడు. పరీక్షా సమయంలో ప్రశ్న పత్రానికి సమాధానాలు రాసి రావాలి లేదా వచ్చినంత వరకైనా రాసి బయటకు రావాలి. కానీ, ఓ పాఠశాలలోని విద్యార్థులు రూ .500 రూపాయల కరెన్సీ నోటును పెట్టి పాస్ చేయండి ప్లీజ్ అంటూ కాళ్ళ బేరానికి వచ్చారు. ఈ ఒక్కసారికి పాస్ చేయండి. మీకు ఇంకా కావాలంటే డబ్బు ఇస్తామంటూ పేపర్ వాల్యూవేషన్ చేసే వాళ్ళకి ఆశ చూపారు. ఇంకొందరైతే ” మీరు పాస్ చేయకపోతే నా ప్రేమ నన్ను విడిచిపెట్టి వెళ్లి పోతుంది” అని పేపర్లో రాశారు. ” మీరు ఇప్పుడు పాస్ చేయకపోతే నా చదువు ఇక్కడితోనే ఆపేస్తా ” అంటూ మరి కొందరు ఎమోషనల్ గా రాశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు