HCA(image credit:X)
హైదరాబాద్

HCA: మరో వివాదంలో HCA.. ఈసారి ఏకంగా!

HCA: నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉన్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్టాండ్ ని తొలగిస్తున్నట్లు హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్ ప్రకటించింది. గతంలో అజారుద్దీన్ అధ్యక్ష్యునిగా ఉన్న సమయంలో అసోసియేషన్‌తో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తన పేరు మీద స్టాండ్ ని ఏర్పాటు చేసుకున్నారని అందుకే ప్రస్తుతం తొలగిస్తున్నట్లు అంబుడ్స్‌మెన్ తెలిపింది.

మరో వైపు అజారుద్దీన్ వర్గీయులు మాట్లాడుతూ భారత జట్టుకు కెప్టెన్ గా, అంతర్జాతీయ క్రీడాకారుడిగా విశేష సేవలందించిన వ్యక్తి పేరును స్టాండ్ కి తొలగించడం సమంజసం కాదని దీని వెనుక ప్రస్తుత హెచ్‌సీఏ ప్రెసిడెంట్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అంబుడ్స్ మన్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు అజారుద్దీన్ వర్గీయులు పేర్కొన్నారు.

Also read: Hydra demolition: ఏపీని తాకిన హైడ్రా ప్రకంపనలు.. టీడీపీ ఎమ్మెల్యే భూముల్లో కూల్చివేతలు..

ఇదిలా ఉంటే హెచ్ సీఏ ఏదోక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతంలో హెచ్‌సీఏ పై అవినీతి ఆరోపణల చాలానే వచ్చాయి. నిధుల అక్రమ లావాదేవీలకు సంబంధించి ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో వ్యవహారం జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించి హెచ్‌సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ పై ప్రత్యేక కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్ (HCA), సన్‌రైజర్స్ (SRH) యాజమాన్యాల మధ్య ఉచిత టికెట్ పాసుల విషయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లడంతో సీరియస్ అయ్యారు. విజిలెన్స్ విచారకు సైతం ఆదేశించారు. ఈ కేసులో SRH యాజమాన్యాన్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టినా ఊరుకునేది లేదని, ఈ వివాదం వెనుక ఎవ్వరు ఉన్న ఉపేక్షించేది లేదని, అన్ని కోణాల్లో విచారణ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. విచారణ ఇంకా కొనసాగుతుంది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?