Tragic Incident ( Image Source: Twitter)
Viral

Tragic Incident: ఓ వైపు తండ్రి శవం.. మరోవైపు లవర్ తో కొడుకు పెళ్లి.. వీడియో వైరల్

 Tragic Incident: ఇటీవలే ప్రపంచంలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యపరచేవి అయితే, మరి కొన్ని విషాదకరమైనవి. వీటికి సంబందించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇవి కాస్తా వైరల్ అవ్వడంతో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా, తమిళనాడులో జరిగిన ఘటన అందరి హృదయాలను కలిచి వేశాయి. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Atma Committee: ఆత్మ కమిటీకి కొత్త ఆశ.. రైతులకు లాభకరమైన పద్ధతులు.. ఆరోగ్యశాఖ మంత్రి!

తమిళనాడులో ఓ యువకుడికి తండ్రి అంటే చాలా ప్రేమ, గౌరవం, ఇష్టం. కష్టపడి తనని చదివించిన నాన్నపై తనకు ఎంత ప్రేమ ఉందో చాటుకున్నాడు. తండ్రి మృతదేహం ముందు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఆశీస్సులు తన పై ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.

Also Read:  MLA Madhava reddy: ప్రభుత్వమే ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది.. నర్సంపేట ఎమ్మెల్యే హామీ!

తమిళనాడులోని విరుధాచలం సమీపంలో కవణై గ్రామం ఉంది. సెల్వరాజ్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి అప్పు అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం, అతడు చదువుతున్నాడు. చదువుకునే సమయంలో విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, అప్పు తండ్రి ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి మరణించారు. తండ్రి మృతితో తీవ్రమనస్తాపం చెందిన అప్పు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి దహనానికి ముందే తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి భార్యగా చేసుకోవాలనుకున్నాడు.

Also Read:  Miss World 2025: సంస్కృతి, సాంప్ర దాయాలతో… అంబరాన్నంటేల అందాల పోటీలు!

నవ వధువులను అప్పు తల్లి, గ్రామస్థులు ఆశీర్వదించారు. అయితే, అమ్మాయి తరఫు ఎవరు అక్కడికి రాలేదు. మోయలేని బాధను కూడా మనసులో పెట్టుకుని అప్పు కుటుంబం ఈ వివాహన్ని జరిపించడం హాట్ గా మారింది. అయితే, ఇది కొందరికి తప్పుగా అనిపించవచ్చు కానీ, అతను కేవలం తన తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఇలా చేశానని అప్పు చెబుతున్నాడు. ఇలాంటి సమయంలో అప్పు ప్రియురాలు పెళ్ళికి అంగీకరించడం గొప్ప విషయం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

స్వేచ్ఛ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ ను క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?