Miss World 2025: తెలంగాణ సంస్కృతి చారిత్రక వైభవం చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ప్రపంచ సుందరి పోటీల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విశిష్ట సంస్కృతులకు కొలువైన తెలంగాణ వైభవం ఒక్క హైదారాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉందని, ఆయా ప్రాంతాలకు ప్రపంచ దేశాల సుందరీమణులను తీసుకెళ్లి వాటి గొప్పతనాన్ని వివరించాలన్నారు.
తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా అందాల పోటీలను సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్ధేశం చేశారు. విదేశీ పర్యాటకులను ఆకర్శించడం ద్వారా పర్యాటక రంగ అభివృద్ధి తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
Also Read: Bhu Bharati Act: భూ వివాదాలకు చెక్.. రాష్ట్రంలో ఆధార్ తరహా పోర్టల్!
రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా వేదికల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. వివిధ వేదికల్లో వేడుకలు నిర్వహిస్తున్నందున ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని, జిల్లా కలెక్లర్లు, ఎస్పీలు, ఇతర అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని సుచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలను ఇందులో భాగాస్వాములను చేయాలన్నారు.
ఈ సమీక్షలో పర్యాటక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ జెండాగే హనుమంత్ కొండిబా, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోని బాలదేవి, యుజవన సర్వీసుల శాఖ డైరెక్టర్ వాసం వెంకటుశ్వర్లు, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నిర్వహకులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/