Bhu Bharati Act: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే, భూభారత్ చట్టం అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. గురువారం దేవరకొండ నియోజకవర్గం లో చింతపల్లి, దేవరకొండ, కొండమల్లేపల్లి మండల కేంద్రాల్లోని కార్యాలయం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి భూభారత్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వివాద రహిత భూవిధానాలు ఉండాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అందుకే నూతన చట్టాన్ని తీసుకొచ్చారని బాలు నాయక్ అన్నారు.
భవిష్యత్తులో ఆధార్ తరహాలో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు హద్దులు వంటి సమగ్రమైన వివరాలతో భూ ఆధార్ తీసుకొస్తామని బాలు నాయక్ పేర్కొన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి శుభ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూభారత్ చట్టం భూభారతి పోర్టల్ ను ముఖ్యమంత్రి శిల్పా కళావేదికలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా తొలివిడత భూభారతిని నాలుగు మండలాల్లో చేపడుతున్నట్లు బాలునాయక్ చెప్పారు. ప్రజా పోరాటాల నుంచే పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Also read: Biogas Plants in Telangana: రాష్ట్రంలో మరో కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు.. మంత్రి తుమ్మల
రెవెన్యూ అధికారులను ప్రజలకు మరింత చేరువలో ఉంచాలని ప్రభుత్వ ఉద్దేశమని ఇందుకోసం 10 954 గ్రామ పాలన అధికారులను నూతనంగా నియమించబోతున్నట్లు బాలు నాయక్ చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రెవెన్యూ సిబ్బందిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి ఆలోచనకు ప్రజా ప్రభుత్వం వ్యతిరేకమని బాలు నాయక్ చెప్పారు. అవినీతికి పాల్పడే వ్యక్తుల పైన కఠినంగా వ్యవహరిస్తాము కానీ వ్యవస్థ పై కాదని బాలునాయక్ అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి సమస్యలు ఉంటే రైతులను విజ్ఞప్తి తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
రెవెన్యూ సిబ్బంది రైతాంగానికి రెండు కళ్ళ లాంటి వారిని రెవెన్యూ శాఖ పైన కొందరు సృష్టించిన అపాలని తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎ ఎస్పీ మౌనిక, నల్గొండ జిల్లా రెవిన్యూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బుజ్జిని యాదగిరిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి, తాసిల్దార్లు శర్మ సంతోష్ కిరణ్, అగ్రికల్చర్ ఏడి శ్రీలక్ష్మి, ఏవో శ్రావణి కుమారి, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, కొండ ఎంపీడీవో డానియల్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.