White Egg: మనం సాధారణంగా వారంలో మూడు నుంచి నాలుగు రోజులు కోడి గుడ్డును ఆహారంగా తీసుకుంటాము. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అలాగే, దీనిని తినడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాము. వైద్యులు కూడా రోజుకొక గుడ్డు తినాలని సూచిస్తారు. అయితే, కోడి గుడ్డు తినడమే వరకే మనకి తెలుసు. ఆ గుడ్డులోకి పచ్చ సొన (yellow yolk) ఎలా వచ్చిందనేది మాత్రం ఎవరికీ తెలియదు. మనం తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించము. కానీ, ఇది సైన్స్ పరంగా చూడాల్సిన అంశం. అసలు, గుడ్డు లోపల పచ్చ సొన ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం..
కోడి గుడ్డు ఏర్పడే ప్రక్రియ:
కోడి శరీరంలో ఒకే ఒక అండాశయం (left ovary) చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అది పసుపు రంగు అండాన్ని (yolk) తయారుచేస్తుంది. అదే పచ్చ సొన. ఈ సొన కోడి అండమే. తల్లి కోడి శరీరంలోని అండాశయంలో సొన తయారవుతుంది. దీనిలో కోడి పిల్లకు కావాల్సిన ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఒకసారి సొన నుంచి విడిపోయిన తర్వాత, ఒవిడక్ట్ అనే గొట్టం ద్వారా కిందకు ప్రయాణిస్తుంది. అక్కడ దానికి మిగిలిన భాగాలు జత చేయడబడతాయి. ఇక చివరిగా వైట్ షెల్ ఏర్పడుతోంది. ఇది గుడ్డు పై భాగంలో క్యాల్షియంతో కూడిన కవచం (shell) ఏర్పడుతుంది. ఆ తర్వాత అది బయటకు ఉత్పత్తి అవుతుంది.
Also Read: Ramya Moksha Pickles: అలేఖ్య మళ్లీ రీల్.. బిగ్ అనౌన్స్‌మెంట్‌తో బిగ్ షాక్!
సొన ఏ దశలో వస్తుందంటే?
సొన మాత్రం అండాశయంలోనే తయారవుతుంది. ఇదొక “ఫాలికిల్” (follicle) అనే పదార్థంగా మారి, అది చిన్నగా మొదలయ్యి , పూర్తిగా గడ్డకట్టి ఒక పసుపు రంగులోకి మారుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒవిడక్ట్‌లోకి చేరుతుంది.గుడ్డు ఫెర్టిలైజ్ కావాలంటే కోడి పెట్ట మగ కోడి (male)తో కలవాల్సిందే. మనం తినే గుడ్లలో బాగా చాలా వరకు ఫెర్టిలైజ్ కానివే అంటే, వాటికి పిల్లలు పుట్టవు. అంటే, సొన అనేది నిజానికి కోడి శరీరంలోనే తయారవుతుంది. అలాగే, చివరికి అది గుడ్డు రూపంలో బయటకు వస్తుంది.
ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
ఒక కోడి రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెట్టగలదు. అలాగే, కోడి ఫెర్టిలైజేషన్ లేకుండానే గుడ్డు పెట్టగలదు. కానీ, పిల్ల మాత్రం పుట్టదు. గుడ్డులో ఒక పరిపూర్ణ జీవ నిర్మాణ వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. గుడ్డు సొనలో విటమిన్ A, D, E, K, కొవ్వులు , ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ల్యూటిన్, కొలెస్ట్రాల్ , సగం రిబోఫ్లేవిన్ మరియు థయామిన్ కలిగి ఉంటుంది. ఇక తెల్లసొనలో సగం ప్రోటీన్ , రిబోఫ్లేవిన్ ఉంటాయి.