Bill Collector Suspended(image credit:X)
ఖమ్మం

Bill Collector Suspended: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో తప్పుడు సమాచారం.. ఉద్యోగి సస్పెండ్!

Bill Collector Suspended: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించే లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరగకుండానే, పూర్తయిందని తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీష్ పై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాల మేరకు బిల్ కలెక్టర్ జగదీష్ ను విధుల నుండి తొలగిస్తూ జిల్లా పంచాయతీ అధికారి నేడు ఆదేశాలు జారీ చేశారు.

Also read: MLA Madhava reddy: ప్రభుత్వమే ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది.. నర్సంపేట ఎమ్మెల్యే హామీ!

భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 18 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేశారనే తప్పుడు సమాచారాన్ని ఆన్లైన్ లో నమోదు చేశారని, దీనిపై సంబంధిత బిల్ కలెక్టర్కు మెమో జారీ చేయగా పొరపాటున ఈ సమాచారాన్ని అప్లోడ్ చేయడం అయిందని సంజయిషి ఇవ్వడంతో ఆ బిల్ కలెక్టర్ ను ఉద్యోగాన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధుల నిర్వహణలో ఏ విధమైన అలసత్వం వహించే ఎంతటి వారినైనా సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!