Protest against Waqf Bill: వక్ఫ్‌బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా జోగిపేట పట్టణంలో ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ముస్లీంలు నల్ల బ్యాడ్జీలను ధరించి వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వృద్దులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది.
ప్లకార్డులు పట్టుకొని బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. నిరసన ర్యాలీ సందర్బంగా జోగిపేట సీఐ అనీల్‌కుమార్, ఎస్‌ఐ పాండు, సంగారెడ్డి నుంచి ఏఆర్ ప్రత్యేక ఫోర్స్‌తో బందోబస్తును నిర్వహించారు.
Also Read: Bhu Bharathi Portal: భూమి హక్కులకు న్యాయబద్ధత.. భూ భారతి చట్టం మీకు తెలుసా?
గుడ్‌ఫ్రైడే కావడంతో ర్యాలీకి పోలీసుశాఖ అనుమతిని నిరాకరించినా ప్రత్యేకంగా అనుమతిని తీసుకొని ర్యాలీని నిర్వహించారు. ముస్లీం సోదరులంతా వందల సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ, ఎస్‌ఐలు స్టేషన్‌కు చేరుకొని ముస్లీం సోదరులతో మాట్లాడారు. ర్యాలీ ప్రశాంతంగా ముగియడంతో పోలీసుశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు