Heavy rains in Hyderabad(image credit: X)
హైదరాబాద్

Heavy rains in Hyderabad: హైదరాబాద్‌‌ను ముంచెత్తిన వర్షం.. మంత్రి కీలక ఆదేశాలు!

Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా ఈదురు గాలులు భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షపాతం ప్రభావం జీహెచ్ ఎంసీ ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఒక్కసారిగా ఈదురుగాలులతో నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగినట్టు అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకురావడంతో ఎమర్జెన్సీ టీమ్స్ డిఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను తొలగించాలని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో చార్మినార్ బహుదూర్ పుర ,నాంపల్లి , అంబర్ పేట్ , ఖైరతాబాద్ , ఎల్బీనగర్ ,కూకట్‌పల్లి ,సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షపాత ప్రభావం ఉందని వెల్లడించారు.

Also read: Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఆ ఏరియాల్లో అల్లకల్లోలం!

వర్షానికి నగరంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు వెంట వెంటనే నీటిని తొలగించాలని ఆదేశించారు. వచ్చే మూడు గంటల్లో నగరంలో మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. డ్రైనేజీ పొంగిపొర్లకుండా hmwssb జెట్టింగ్ మిషన్స్ ద్వారా అరికడుతున్నారు. పోలీస్ , జీహెచ్ఎంసీ , వాటర్ బోర్డ్ ,విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకొని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు