Jogipet News: సాధారణ ప్రత్తి సాగు కంటే ఈ అధిక సాంద్రత ప్రత్తి సాగు పద్ధతిలో సాగు చేస్తే మేలైన దిగుబడి వస్తుందని ఏరువాక కేంద్రం సమన్వయకర్త ( కోఆర్డినేటర్) శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ అన్నారు. అందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో ఏరువాక కేంద్రం సంగుపేట్ వారి ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తి పంటపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ విశ్వకర్మ మాట్లాడుతూ అధిక సాంద్ర పద్ధతిలో వేసిన ప్రత్తి పంట గురించి రైతులకు వివరించారు.
ఈ పద్దతి వల్ల మొక్కల సంఖ్య పెరిగి, అనగా ఎకరాకు 22,222 లేదా 25,000 మొక్కలు వస్తాయని, తక్కువ పంటకాలము వల్ల ఒకేసారి పూత కాయలు రావడం వలన పంట తొందరగా చేతికి వస్తుందన్నారు. గులాబి రంగు కాయ తొల్చు పురుగు బారి నుండి తప్పించుకొని నికర ఆదాయంను పొందవచ్చునని వివరించారు. తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పి. రవి కుమార్, మరియు ఎన్.ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ ఈ పద్దతి ద్వారా సాగు చేయడం వలన పూత కాత బాగా వచ్చి దిగుబడి పెరుగుతుందన్నారు.
Also Read: Bhu Bharathi Portal: భూమి హక్కులకు న్యాయబద్ధత.. భూ భారతి చట్టం మీకు తెలుసా?
అధిక సాంద్రత పద్ధతిలో రైతులు మొదటి పంట పూర్తికాగానే రెండవ పంట కాలానికి విత్తుకొనుటకు ఆస్కారం ఉంటుందన్నారు. యాసంగిలో వరిలో మెడ విరుపు తెగుళ్లు వాటి యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీహరి, మండల పంచాయతీ అధికారి పి.సోమనారాయణ గ్రామపంచాయతీ సెక్రటరీ నిస్సార్ హుస్సేన్ ,వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మీకాంత్, ఏరువాక కేంద్రం వైపి 2 – రేఖా మనోజ్, వైపి 1- ఎస్. శ్రీకాంత్, కె.ఆకాష్, గ్రామ రైతులు , పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు