Heavy rains in Hyderabad (Image Source: Twitter)
హైదరాబాద్

Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఆ ఏరియాల్లో అల్లకల్లోలం!

Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలి వానతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు తడిచి ముద్ద అయ్యాయి. మరోవైపు రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగస్తులు సైతం తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఆ ఏరియాల్లో భారీ వర్షం

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మాదాపూర్, ఎస్‌ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అటు కోఠి, దిల్‌షుక్‌నగర్, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ వాసులు మరో 3 గంటలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weatherman) సూచించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. అంతకుముందు నగరంలో ఈదురు గాలులు వీస్తున్న దృశ్యాలను సైతం తెలంగాణ వెదర్ మ్యాన్ తన ఎక్స్  ఖాతాలో రీట్విట్ చేశారు. కోకాపేట, చాదర్ ఘాట్ లో గంటకు 50-60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు