Aghori Uppal Balu: గత కొద్దీ రోజుల నుంచి ఉప్పల్ బాలు, అఘోరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, తాజాగా కొత్త వీడియోలో మాటల తూటాలను పేల్చాడు. ప్రస్తుతం, ఇది నెట్టింట వైరల్ గా మారింది.
అఘోరి మాట్లాడిన ఓల్డ్ వీడియోలో ” మన సంస్కృతిలో మన సనాతన ధర్మంలో హిందూ సంప్రదాయాలలో ఎక్కడైనా ఇలాంటి ఆచారం ఉందా? ఒక ఆడ పిల్ల, ఆడ పిల్లకు మెడలో తాళి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు వాళ్ళు. నేను అదే అడుగుతున్నా కదా ఇది ప్రజలకు వదిలేస్తున్న ” అని అతను మాట్లాడిన పాత వీడియోను షేర్ చేస్తూ ఉప్పల్ బాలు మరోసారి మండిపడాడ్డు.
Also Read: Protest Against PM Modi: సోనియా, రాహుల్ పై ఈడీ కేసు.. ఓ ఆట ఆడుకున్న మీనాక్షి నటరాజన్!
ఉప్పల్ బాలు మాట్లాడుతూ ” మొత్తం నువ్వే కదా చెప్పింది. మన హిందూ సంప్రదాయంలో ఆడవాళ్లు ఆడవాళ్లు ఎలా పెళ్లి చేసుకుంటారని అంత మంచిగా చెప్పి, ఇప్పుడు నువ్వు చేసేదేంటి? అని ప్రశ్నించాడు.
మంచిగా, మర్యాదగా చెబుతున్నా.. ఇప్పటికైనా ఆపు ఇవన్నీ అని సైలెంట్ గా మొదలు పెట్టి గట్టి కౌంటరే ఇచ్చాడు. ఇంకా మాట్లాడుతూ నువ్వు అనుకుంటున్నావేమో మంత్రాలకు చింతకాయలు రాలతాయని అంతలేదు అక్కడ? నువ్వు నన్నేం చేయలేవని గట్టిగా చెప్పాడు. నువ్వు దొంగ అఘోరివి, మగవాడిలాగా మారి నీ ఇష్టమొచ్చినట్లు చేస్తున్నావ్ అని అన్నాడు. నీ వల్ల సమాజం మొత్తం పాడవుతోంది. ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, నీ వీడియోలే వస్తున్నాయని ఏంటి మాకు ఈ గోల అంటూ నిలదీశాడు. అబ్బా.. నీ ముఖం కూడా నాకు చూడాలనిపించడం లేదు. నిన్ను పోలీసులు పట్టుకునే వరకు నా పోరాటం ఆపను, నిన్ను జైలుకి పంపించకపోతే నా పేరు ఉప్పల్ బాలు నే కాదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. నా టార్గెట్ మొత్తం నువ్వే.. ఆ పిల్లకి నువ్వు అయిన నువ్వు చెప్పాలి కదా, వర్షిణి నువ్వు ఇంటికి వెళ్లు తల్లీ, అఘోరి వెంట ఎందుకు తిరుగుతున్నావని ఆమె గురించి కూడా మాట్లాడాడు. నిన్ను కూడా పట్టుకుంటే నీ పరిస్థితి ఏంటి? నీకు ఎవరు తోడు ఉండరు. నిన్ను ఏమన్నా చేస్తారేమో అనే నా భయం అని ” అఘోరి, వర్షిణి పై సంచనలన కామెంట్స్ చేశాడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు