Viral Video: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media) ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో వచ్చేస్తుంది. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది. ఇది చూశాక .. వామ్మో ఇదంతా నిజమేనా ? అని మీరు కూడా షాక్ అవ్వడం పక్కా..! ఇంతకీ , ఆ వీడియోలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Ramya Moksha Pickles: అలేఖ్య మళ్లీ రీల్.. బిగ్ అనౌన్స్‌మెంట్‌తో బిగ్ షాక్!
డబ్బు సంపాదించడానికి మనుషులు చాలా కష్ట పడుతుంటారు. దీని కోసం పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తుంటారు. నెలాంత పని చేశాక , చేతిలోకి వచ్చిన డబ్బును చూశాక ఆ కష్టాన్ని మర్చిపోతారు. ఇలా ఎవరికీ వారు తమ కుటుంబాన్ని పోషించడానికి పెద్ద మొత్తంలో డబ్బును సంపాదిస్తారు. మరి ఇలాంటి డబ్బు ఏ పని చేయకుండా మన చేతి లోకి వచ్చి పడితే ఎగిరి గంతేయ్యడం పక్కా!
తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో పొలంలో డబ్బు వర్షం కురిసింది. కొందరు లారీ మీద నుంచి డబ్బును పూల వర్షంలా కురిపించారు. మీరు వింటున్నది నిజమే. కొన్ని వందల కరెన్సీ నోట్లు గాల్లోకి ఎగిరాయి. ఎగిరే ఈ నోట్లు కింద పడుతుండటంతో చుట్టు పక్కల జనాలు, వారి జేబులను నింపుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చింతకాయలు ఏరుకున్నట్టు ఏరుకున్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు