Bhu Bharati Act (imagecredit:swetcha)
మహబూబ్ నగర్

Bhu Bharati Act: చట్టం దేశానికే ఆదర్శం.. చరిత్రలో నిలిచేలా చేశాం.. మంత్రి పోంగులేటి

మహబూబ్ నగర్: Bhu Bharati Act: దేశంలో భూభారతి చట్టం రోల్డ్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు నిద్ర పోకుండా మేధావులతో కలిసి భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. భూభారతి చట్టం పై అవగాహన కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సు కు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టానికి, భుభారతి చట్టానికి ఎంతో తేడా ఉందని, భూభారతి చట్టం రైతు భూ సమస్యకు పరిష్కారం చూపుతుందన్నారు.

తమ భూములు ధరణి వల్ల ఇంకా తమ పేరిట నమోదు కాలేదని ప్రతి పక్ష శాసన సభ్యులే అసెంబ్లీలో తనను అడిగారని, కానీ ప్రతి పక్ష నేత శాసన సభలో భూభారతి చట్టానికి ఆమోదం తెలపకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. ధరణి చట్టం వల్ల ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, కానీ భూభారతి చట్టం వల్ల ప్రజల వద్దకే అధికారులు వారి వారి గ్రామాలకు వచ్చి ఒక్క రూపాయి తీసుకోకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు. రైతుకు, భూమికి మధ్య ఉన్న బంధాన్ని ఈ చట్టం ధృడం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం ధరణితో వేలాది ఎకరాలను కొల్లకొడితే, భూ భారతి ద్వారా అర్హులైన పేదలకు భూములు పంచాలనే ఆలోచన తమ ప్రజా ప్రభుత్వానిది అన్నారు. అసైన్డ్ భూములకు కూడా హక్కులు కల్పిస్తామన్నారు.

కోర్టులో లేని భూ సమస్యను పరిష్కరించడమే లక్షం:

గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవిన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. కోర్టులో లేని ప్రతి భూ సమస్యను పరిష్కరించడమే భూభారతి ముఖ్య ఉద్దేశమన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్ డ్ సర్వేయర్లను ఏర్పాటుచేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్ పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో, మనస్సాక్షిగా పేదవారికి మేలు చేయాలని అద్భుతమైన ఈ చట్టాన్ని చేసుకున్నామని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. మొదటగా 4 మండలాలను ఫైలెట్ గా తీసుకున్నామని, మే 1 నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాలకు జిల్లా కలెక్టర్లు వెళ్లి ఈ చట్టం గురించి ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోపు ఎంపిక చేసిన మొదటి నాలుగు ఫైలెట్ గ్రామాల సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. భవిషత్తు లో ఇబ్బందులు రాకుండా ప్రతి రైతుకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తాము అమలు చేస్తున్న కొత్త భూభారతి చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కూడా వినియోగించుకోవచ్చని మంత్రి సూచించారు. తమ భూ సమస్యల గురించి తనతో చెప్పిన ప్రతి పక్ష ఎమ్మెల్యేలు, చెప్పని వారు కూడా కొత్త చట్టం వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవచ్చని సలహా ఇచ్చారు. ధరణితో ప్రజలకు ఎంతో ఘోస పెట్టారో భూ భారతి అమలు లోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మంచి చేసిందని చెప్పకపోయినా పర్వాలేదు కానీ మంచిని చెడుగా చెప్పి ప్రచారం చేస్తే మాత్రం ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికలలో రెండు అంకెల సీట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా శాసన సభ ఎన్నికలలో రిపీట్ అవుతుందని ఆయన తెలిపారు.

Also Read: Tirumala Goshala controversy: అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఏం జరిగిందంటే?

కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ధరణి స్థానంలో సరళమైన భూ భారతి పోర్టల్ ను ఈ నెల 14 న ప్రారంభించిందని, అందులో భాగంగా నారాయణ పేట జిల్లాలోని మద్దూరు మండలాన్ని పైలెట్ మండలము గా ఎంపిక చేసిందని తెలిపారు. భూ పరిపాలనలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పోర్టల్ ను జిల్లా అధికార యంత్రాంగం, ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పారు. సమస్యల తక్షణ పరిష్కారంలో భాగంగా తీసుకొచ్చిన ఈ సంస్కరణలు అమలు చేసేందుకు నారాయణపేట జిల్లాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీ, రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా ప్రజల తరపున కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యే లు డాక్టర్ వాకిటి శ్రీహరి, డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎనుముల తిరుపతి రెడ్డి, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, ప్రిన్సిపల్ సెక్రెటరీ రెవిన్యూ శాఖ, జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐ ఏ ఎస్, ప్రిన్సిపాల్ సెక్రటరీ రెవిన్యూ శాఖ,సీసీ ఎల్ ఏ సెక్రెటరీ మంద మకరంద్ IAS,జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్,జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, న్యాయవాది భూమి సునీల్, ఆర్డీఓ రామచందర్ నాయక్, డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి,మద్దూరు సింగిల్ విండో చైర్మన్ నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?