jmira Suresh Naik: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా పాలన లక్ష్యం అని ఎన్ ఎస్ యూ ఐ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయిక్ అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని ప్రశాంతి నగర్ లో సన్నబియ్యం లబ్దిదారులు కిషోర్, శశికళ కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన వారి కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం లబ్ధిదారుని కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం లబ్దిదారుని ఇంట్లో మధ్యాహ్న భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Protest Against PM Modi: సోనియా, రాహుల్ పై ఈడీ కేసు.. ఓ ఆట ఆడుకున్న మీనాక్షి నటరాజన్!
ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,గృహజ్యోతి పథకం ద్వారా నిరుపేద ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.రైతు భరోసా ద్వారా రైతులకు12వేల పెట్టుబడి సహాయం,రైతులకు 2 లక్షల రుణమాఫీ,రజా ప్రభుత్వ తొలి ఏడాదిలోనే 50 వేలకు పైన ప్రభుత్వ ఉద్యోగాలు.ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం.
తెలంగాణ రైతాంగానికి రక్షణ కవచంగా భూభారతి పథకం. పేద,మధ్యతరగతి ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ. బడుగు బలహీన వర్గాల భావితరాల భవిష్యత్తు కోసం బిసిలకు42% రిజర్వేషన్.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకోసం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా 5 లక్షల వరకు ఆర్ధిక సహాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. బిజెపి,బిఆర్ఎస్ శ్రేణులు ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక,జీర్ణించుకోలేక ప్రజను ప్రక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నాయకులు లకవత్ సుమన్, కాటి సంతోష్, కాటి సందీప్, సిద్దు,తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు