Collector Jitesh V Patil: విద్యార్థి దశలో కష్టపడి చదివితే ఇష్టమైన జీవితం మన చేతిలోకి వస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపక బృందం విశాలమైన తరగతి గదులు క్రీడా ప్రాంగణం అన్ని వసతులు కలిగి ఉండడం వలన కళాశాలలో విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులు కేవలము చదువు పైన కాకుండా క్రీడల పైన కూడా ఆసక్తిని కలిగి ఉండాలని తద్వారా విద్యార్థుల్లో శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారని ఆయన అన్నారు. విద్యార్థులు ఈ మూడు సంవత్సరాలు కష్టపడి చదివి కళాశాలకు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు.
మూడు సంవత్సరాలు కష్టపడితే 30 సంవత్సరాల సుఖపడవచ్చు అని ఒకవేళ మూడు సంవత్సరాలు ఎంజాయ్ చేశారంటే 30 సంవత్సరాలు కష్టపడతారని తెలుపుతూ జిల్లా కలెక్టర్ తన స్వీయ అనుభవంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి విద్యార్థులతో పంచుకున్నారు.
CM Revanth Reddy: సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. శంషాబాద్ హోటల్‌లో కలకలం
అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోలారపు పద్మ మాట్లాడుతూ.. కళాశాల అటానమస్ హోదా పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా పరీక్షలు నిర్వహించి సకాలంలో మూల్యాంకనం చేసి ఫలితాలను కలెక్టర్ చేతుల మీదుగా విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో అతిథి ప్రిన్సిపాల్ వై.చిన్నప్పయ్య, అటానమస్ కంట్రోల్ ఎగ్జామినేషన్ వేముల కామేశ్వర రావు,కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె మాధవి, డాక్టర్ టి అరుణకుమారి డాక్టర్ కే కొండలరావు విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు