స్వేచ్ఛ ఖమ్మం: Pusa chickpea 4037: భారత యువ శాస్త్రవేత్త, ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని దివంగత డాక్టర్ అశ్విని కి అరుదైన గౌరవం లభించింది. వ్యవసాయ రంగంలో చేసిన కృషికి, ఆమె ప్రతిభకు కేంద్రం తాజాగా గుర్తింపు అందించింది. పూస శనగ – 4037రకానికి చెందిన శనగకు అశ్విని పేరు పెడుతూ అశ్విని పేరిట జాతీయ స్థాయిలో కొత్త శనగ వంగడాన్ని విడుదల చేసింది. త్వరలో గెజిట్ నోటిఫికేషన్ లో ఆ వంగడాన్ని పొందుపరచ నున్నారు.
దీంతో నేడు భౌతికంగా మన మధ్యన అశ్విని లేకపోయినా, దేశ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోవడం ఖాయం. ఇక్రిసాట్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న గిరిజన బిడ్డ డాక్టర్ అశ్విని, ఛత్తీస్‌గఢ్‌లో రాయపూర్ వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సుకు పాల్గొనడానికి వెళ్తున్న తరుణంలో ఆకేరు వాగు వరద ముంపులో కారుతో సహా కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన సంగతి అందరికీ తెలిసినదే.
Also Read: CM Revanth Reddy: ఆ రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఖరారు!
ఎంతో కష్ట పడి చదివి శాస్త్రవేత్తగా ఎదిగిన అశ్విని తన గ్రామంలో నేటి యువతరానికి చదువు ప్రాముఖ్యతను వివరించే వారు.అశ్విని లాంటి అత్యంత ప్రతిభ, నైపుణ్యం గల శాస్త్రవేత్తను కోల్పోవడం అత్యంత బాధాకరమని చెబుతూ నాడు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని ఇంటి కెల్లి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అశ్విని కుటుంబానికి 10 లక్షల రూపాయలతో పాటు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు.