Technology: జపాన్ మన భారత దేశం కంటే ఎంతో అభివృద్ది చెందింది. ముఖ్యంగా, టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ డ్ ఉందనే చెప్పుకోవాలి. ఈ దేశంలో చిన్న రోబోల నుంచి పెద్ద కార్లు వరకు తయారవుతుంటాయి. వరల్డ్ లోనే అత్యంత పవర్ జనరేట్ చేయగల మోటారు వాహనాలు జపాన్ లో తయారు చేస్తుంటారు. ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, ఆటోమోటివ్ వంటి రంగాలకు ప్రసిద్ధి చెందింది. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
రోడ్లు
జపాన్ లో రోడ్లు అద్బుతంగా ఉంటాయి. ఈ రహదారి పై వెళ్తున్నప్పుడు మీకు ఒక రకమైన మ్యూజిక్ వినిపిస్తుంది. ఇది నిజమేనా అని సందేహిస్తున్నారా? అంత ఆలోచించకండి ఇది నిజమే. మీరు సరైన వేగంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు టైర్లు రోడ్డును తాకినప్పుడు సినిమా పాటలో ఉండే సంగీతం వినిపిస్తోంది. అక్కడ జర్నీ చేసేటప్పుడు దీనిని బాగా చేస్తారు.
Also Read: Gold Rate Today : మహిళలకు షాకింగ్ న్యూస్.. వామ్మో బంగారం ఇంత పెరిగిందేంటి?
కార్ పార్కింగ్
జపాన్ లో కార్ పార్కింగ్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మన వెళ్ళిన ప్రదేశం వద్ద ప్లేస్ ఉంది కదా పార్క్ చేసుకుంటాము అంటే కుదరదు. ఆ దేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని అందరూ కచ్చితంగా పాటించాల్సిందే. మన దేశంలో కొన్ని చోట్ల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది? మరి కొన్ని చోట్ల ఉండదు? దేశాన్ని వెంటాడే సమస్యల్లో ఇది కూడా ఒకటి. కానీ, జపాన్ లో కారును పార్కింగ్ చేయాలంటే హైడ్రాలిక్ మిషన్ ను ఉపయోగించాల్సిందే. ఈ మిషన్ అనేక అంతస్తులను కలిగి ఉన్న ఒక బిల్డింగ్ లో మీ వెహికల్ కు పార్కింగ్ చేసుకోవాలి. చిన్న ప్రదేశంలోనే వేల కార్లను ఒకే చోట పార్క్ చేసుకోవచ్చు.
Also Read: Airports Authority of India: డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు!
బుల్లెట్ ట్రైన్స్
మన దేశంలో అత్యంత వేగంగా నడిచే వందే భారత్ స్పీడ్ గంటకు 180 కిలో మీటర్ల వేగంతో వెళ్ళేలా రూపొందించారు. కానీ, ఇది ఇప్పటి వరకు గంటకు 160 కిలో మీటర్ల వేగంతో కూడా వెళ్ళినా సందర్భం లేదు. కానీ, జపాన్ లో ట్రైన్స్ స్పీడ్ 320 km/h కంటే మెరుపు వేగంతో నడుస్తాయి. అంత వేగంగా వెళ్లినా ట్రైన్ లో ఉన్న ప్రయాణీకులు సురక్షితంగా ఉంటారు. అంతే కాదు, తగిన జాగ్రత్తలు కూడా ముందే తీసుకుంటుంది. ఇవి హై స్పీడ్ తో నడుస్తాయి. మళ్లీ అంతే వేగంతో వాటి గమ్యస్థానాన్ని చేరుకుంటాయి. ఇవి చాలా వేగంగా నడిచినా వస్తువులేం కింద పడవు. ఎంతలా అంటే మీరు మీ విండో సీట్ పై రూపాయి నాణేన్ని నిలుచోబెడితే, అది కదలకుండా, కింద పడకుండా అలాగే ఉంటుంది. ఇంత అద్భుతమైన టెక్నాలజీతో జపాన్ మన భారత దేశంతో కంటే ఎన్ని సంవత్సరాల అడ్వాన్స్ డ్ గా ఉందో మీరే ఒకసారి ఊహించుకోండి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు