Ganja Seized (imagecredit:AI)
క్రైమ్

Ganja Seized: మెఫెంటిమైన్ సల్ఫేట్​ ఇంజక్షన్లు… డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Ganja Seized: వేర్వేరు చోట్ల దాడులు జరిపిన సౌత్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు నలుగురిని అరెస్ట్​ చేసి వారి నుంచి మెఫెంటిమైన్ సల్ఫేట్​ ఇంజక్షన్లు, ఆల్ఫాజోలెం టాబ్లెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఓల్డ్ మలక్​ పేట నివాసి మహ్మద్ ఇమ్రాన్​ (32) చాదర్​ ఘాట్​ పోలీస్​ స్టేషన్​ లో రౌడీషీటర్​ గా నమోదై ఉన్నాడు. 15కు పైగా క్రిమినల్​ కేసుల్లో నిందితునిగా ఉన్న మహ్మద్​ ఇమ్రాన్​ ప్రస్తుతం ఓల్డ్​ మలక్​ పేట ప్రాంతంలో పాన్​ షాప్​ నడుపుతున్నాడు. కాగా, మత్తుకు అలవాటు పడ్డ మహ్మద్​ ఇమ్రాన్​ చాలా రోజులుగా మెఫెంటిమైన్​ సల్ఫేట్​ ఇంజక్షన్లు తీసుకోవటానికి అలవాటు పడ్డాడు.

ఇక, పాన్​ షాప్​ ద్వారా ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో ఆ ఇంజక్షన్లతోపాటు ఆల్ఫాజోలెం టాబ్లెట్లు, గంజాయి అమ్మటం మొదలు పెట్టాడు. ఓల్డ్​ మలక్​ పేట వాహెద్​ నగర్​ మహారాజా హోటల్​ వద్ద ఈ మత్తు పదార్థాలను అమ్ముతున్నాడు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్​ ఫోర్స్ సీఐ రాఘవేందర్​ , ఎస్సైలు నవీన్​, మహేశ్​, ఆంజనేయులు, నర్సింలుతోపాటు చాదర్ ఘాట్ పోలీసులతో కలిసి దాడి చేసి మహ్మద్​ ఇమ్రాన్​ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 2లక్షల రూపాయల విలువ చేసే మెఫెంటిమైన్ సల్ఫేట్​ ఇంజక్షన్లు, ఆల్ఫాజోలెం టాబ్లెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం చాదర్​ ఘాట్​ పోలీసులకు అప్పగించారు.

Also Read: Hyderabad Crime: చంపి మరీ మృతదేహంపై డ్యాన్సులు.. ఓ యువకుడి నిర్వాకం..

మరో కేసులో…  

మరో కేసులో ముగ్గురిని అరెస్ట్​ చేసిన సౌత్​ జోన్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు వారి నుంచి లక్షా 20వేల విలువ చేసే మెఫంటిమైన్​ సల్ఫేట్​ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. శాలిబండ నివాసి సయ్యద్​ అసద్​ (28) వృత్తిరీత్యా దర్జీ. కాగా, మత్తుకు అలవాటు పడ్డ సయ్యద్ అసద్​ న్యూట్టాడు. ఈఢిల్లీలోని ఇండియా మార్ట్​ నుంచి ఆన్​ ద్వారా ఇంజక్షన్లు తెప్పించుకుని తీసుకునేవాడు. కాగా, సిక్స్​ ప్యాక్​ బాడీ కోసం ప్రయత్నించే వారి నుంచి ఈ ఇంజక్షన్లకు డిమాండ్​ ఉందని తెలియటంతో వాటిని అమ్మటం మొదలు పె క్రమంలో తన స్నేహితులైన బాలాపూర్ నివాసి అహమద్​ ఖురేషీతోపాటు ఓ మైనర్​ బాలుని ద్వారా హరిబౌలి చౌరస్తా ప్రాంతంలో ఈ ఇంజక్షన్లను అమ్మిస్తున్నాడు.

ఈ మేరకు సమాచారం సేకరించిన టాస్క్​ ఫోర్స్ సీఐ రాఘవేందర్​ , ఎస్సైలు నవీన్​, మహేశ్​, ఆంజనేయులు, నర్సింలుతోపాటు మొఘల్​ పురా పోలీసులతో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. వీరిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మొఘల్​ పురా పోలీసులకు అప్పగించారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?