Corruption In Bhadradri (imagecredit:twitter)
ఖమ్మం

Corruption In Bhadradri: ఏజెన్సీ భూముల్లో అక్రమ బదలాయింపులు.. ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్?

అశ్వారావు పేట్ స్వేచ్ఛ: Corruption In Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర బిందువైన కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవినీతికి అడ్డాగా మారిందని జిల్లా ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట,ములకలపల్లి, కొత్తగూడెం, పాల్వంచ చుట్టుపక్కల మొత్తం ఏజెన్సీ ప్రాంతాలే అయినప్పటికీ కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నాన్ ట్రైబల్ వారసత్వ బదిలీలు, ఇతర రిజిస్ట్రేషన్ లు ఎలా జరుగుతున్నాయనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక్కో రిజిస్ట్రేషన్ కు ఇరువై వేలు నుంచి నలభై వేల వరకు వసూలు చేస్తున్నారని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. డోర్ నెంబర్, పార్టిషన్ రిజిస్ట్రేషన్ల పై సబ్ రిజిస్టర్ కి ఎందుకు అంత మక్కువ అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా అసైన్డ్ భూములకు మార్ట్ గేజ్ లోన్ మాత్రమే ఇస్తూ ఉంటారు. అలాగే గిరిజనల ఇల్లు వగైరా వాటికి మాత్రమే పార్టీషన్ చేయాలి. ఇతరులకు పార్టిషన్ చేసుకునే అధికారం లేదు. కాబట్టి వీరు చాటుమాటున సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంతమందితో కుమ్మక్కై ఈ పార్టీషన్ డీడ్ గిరిజనేతరులు చేసుకుంటున్నారని వినికిడి. ఒక్కో పార్టీషన్ కు ఇరవై వేల నుండీ నలభై వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మామూలుగా ప్రభుత్వ అనుమతులతో కూడిన రిజిస్ట్రేషన్లు చేస్తే రిజిస్టార్లకు రూపాయి కూడా లాభం ఉండదు ప్రభుత్వ చలనాలు తీసి రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తారు.

కానీ గరిజనేతరులకు పార్టిషన్ మరియు డోర్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తే ఒక్కోదానికి గాను ఒక్కో రేటు ఫిక్స్ చేసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు చాలానే వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని కీలక అధికారి మాత్రం ఎవరు ఏమనుకుంటే నాకేంటి నా దారి సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తుండటం అక్కడి వారిని విస్తుగొలుపుతుంది. సెలవకి ఒకరోజు ముందే గిరిజనేతురుల పార్టిషన్ కి ప్లాన్ చేసుకొని సెలవుకు ముందు రోజే భారీగా డబ్బులు దండుకొని ఇంటికి వెళ్తున్నారని ఆరోపణలు అనేక రకాలుగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని కొంత కాలం సెలవు పై వెళ్లి మళ్లీ అంతా సద్దుమణిగాక అక్కడే తిష్ట వేయడంతో ఆ అధికారికి పై స్థాయిలో కూడా బాగానే పలుకుబడి ఉన్నట్టు అనుమానం రాక మానదు.ఉన్నతాధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి.

Also Read: CM Revanth Reddy: జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి.. మళ్లీ పెట్టుబడులే లక్ష్యం.. 

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు అక్రమ భూ బదలాయింపులను అరికట్టడానికి, డాక్యుమెంట్లను ప్రత్యేకించి పరిశీలించడానికి ఆడిటింగ్ అధికారులు ఉంటారు. కానీ వీరు కాసులకు కక్కుర్తి పడ్డారా లేక రాజకీయ నాయకులకు తలవంచారో తెలియదు కాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కరువైపోయిందని స్థానికులు అంటున్నారు. ఆడిటింగ్ అధికారులు సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా రికార్డులు తనిఖీ చేయకపోవడం మరో విశేషంగానే చెప్పవచ్చు అంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు.

గిరిజన చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఎవరి పేరు మీదైతే భూములు ఉంటాయో వారికి మాత్రమే హక్కులు ఉంటాయి. వారి పిల్లలకు కూడా ఎటువంటి భూ బదలాయింపు చేయకూడదు. కానీ ఇక్కడ గిరిజనేతరులకు సైతం భూ బదలాయింపు చేయటం పరిపాటిగా మారిపోయిందని చెప్పవచ్చు. దీనికి సపరేట్ జీవో ఏమైనా ఉందా అని స్వేచ్చ విలేకరి అడగగా ఉన్నాయి నా దగ్గర 32 ఏ 32 బి అనే జీవోలు ఉన్నాయని కీలక అధికారి స్వయంగా చెప్పటం మరో విశేషం. అశ్వరావుపేట పరిధిలో ప్రభుత్వ భూములకు అక్రమ రిజిష్ట్రేషన్లు చేయడంతో పాటు ఏజెన్సీ భూములను నాన్ ఏజెన్సీ భుములుగా చూపిస్తూ కొంత మంది బడా బాబులు అక్రమాలకు పాల్పడుతుంటే రిజిస్ట్రేషన్ అధికారుల వారికి వంత పాడుతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.

అశ్వరావు పేట్ లోని 1165 సర్వే నెంబరు, ఈసీ లో ప్రభుత్వ భూముగానే చూపిస్తున్నప్పటికీ కొంతమంది అక్రమార్కులు 1165 సర్వే నంబర్ తో ఈ మధ్యకాలంలో పక్కా రిజిస్ట్రేషన్ చేయడం దానికి దాదాపు మూడు లక్షల రూపాయల వరకు చేతులు మారాయని ఆరోపణలు వెలుగు చూశాయి. దీంతో దానికి సంబంధించిన అధికారులు ఒకరిపై ఒకరు నువ్వు అంటే నువ్వు అని ఆరోపణలు చేసుకోవడం ఆ మద్య బాగా చర్చనీయంశమైంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపితే కానీ నిజా నిజాలు బయటపడవు.
అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

సెక్షన్ 22-ఏ సబ్ సెక్షన్ (1) లోని క్లాజ్( ఏ) ప్రకారం అసైన్డ్ భూములలో భూముల బదలాయింపు నిషిద్ధము క్లాజ్(బి) ప్రకారం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేస్తే అట్టి దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిషిద్ధము.అయినా కూడా పార్టిషన్ మరియు డోర్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారని అడగగా ఏమీ రాసుకుంటావో రాసుకో మాహ అయితే సస్పెండ్ చేస్తారు అంతేగా ప్రాణం అయితే తీయరుగా అని అధికారులు నిర్లక్యపు సమాధానం చెప్తున్న పరిస్థితి.

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?