TG Govt on Women: మహిళా సంఘాల స్వయం సమృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందించి ఆర్థిక అభివృద్ధి బాటలో సంఘాలు పయనించేలా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలోని 5114 ఎస్ హెచ్ జి గ్రూప్ లకు నిధులు రూ.11.50 కోట్లు అందించింది. ఈ నిధులతో మహిళ సమాఖ్యల ఆధ్వర్యం లో ఆర్టీసీ బస్సులను కొనుగో లు చేసేందుకు సంఘాలు స సమాయత్త మవుతున్నాయి.
నర్సంపేట నియోజకవర్గం లోని చెన్నారావుపేట మండలంలోని 763 ఎస్ హెచ్ జి గ్రూపులకు రూ.1.77 కోట్లు, దుగ్గొండి మండలం లోని 871 ఎస్హెచ్జి గ్రూపులకు రూ.1.64 కోట్లు, ఖానాపురం మండలానికి 767 ఎస్హెచ్జి గ్రూపులకు రూ.1.87 కోట్లు, నల్లబెల్లి మండలంలోని 784 ఎస్హెచ్జి గ్రూపులకు రూ.1.65 కోట్లు, నర్సంపేట లోని 891 ఎస్హెచ్జి గ్రూపులకు రూ. 2.19 కోట్లు, నెక్కొండ మండలంలోని 1038 ఎస్హెచ్జి గ్రూపులకు రూ.2.37 కోట్లు మంజూరు చేశారు.
Also Read: CM Revanth Reddy: పద్దతి మార్చుకోండి.. ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్..
వడ్డీ లేని రుణాలతో మేలు…
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతో మేలు జరగనుంది. ఈ రుణాలతో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సులను కొనుగోలు చేయడం ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకివ్వడం వల్ల మహిళా సంఘాలకు ఆదాయం పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా మహిళా సంఘాలకు చెల్లించ నున్న అద్దె తిరిగి బ్యాం కులకు సులభ వాయిదా ల ద్వారా కిస్తీల రూపంలో చెల్లించను న్నారు. వడ్డీ లేని రుణాలు వల్ల సంఘాలకు ఎక్కువ నిధులు సమకూరి అభివృద్ధి బాటలో పయనించనున్నాయి.
నర్సంపే ట నియోజకవర్గం లోని అన్ని మండలాలకు నిధులను మం జూరు చేసింది. ఎన్ని నిధుల ను కూడా మహి ళా ఎస్హెచ్జి గ్రూ పులకు అందిం చింది. వీటి తో బస్సుల కొను గోలు చేసి ఆర్టీసీ డిపోల కు అద్దెకు ఇవ్వనున్నా రు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో సభ్యులు సంబురాలు చేసుకుంటున్నారు.
Also Read: Bhu Bharati Act: భూ భారతి అప్పీల్ చేయాలా?.. ఈ రూల్స్ తెలుసుకోండి!
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించినట్లుగానే హామీని నిజం చేయడం వల్ల మహిళలు సంబరాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో కొనుగోలు తో పాటు, మిగిలిన నిధులతో మహిళలు వ్యాపా రాలను నిర్వహిం చుకునేం దుకు పెట్టుబడులు సమకూ ర్చినం దుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు